ఏపీకి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ఉంటే….ఉత్తరాంధ్రకు సీఎంగా విజయసాయిరెడ్డి ఉన్నారని ప్రతిపక్ష టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఏదో ఉత్తరాంధ్ర తన రాజ్యంలాగా విజయసాయి పాలిస్తున్నారని, అలాగే ప్రతిపక్ష టిడిపిని టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తున్నారని, ఎడాపెడా భూ కబ్జాలు చేస్తూ, పైగా టిడిపి నేతలే భూ కబ్జాలు చేస్తున్నారని రివర్స్‌లో ఆరోపిస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు ఉత్తరాంధ్రలో మంచి పేరు ఉన్న అశోక్ గజపతి రాజుని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని అంటున్నారు.

అసలు వైసీపీ అధికారంలోకి వచ్చాక విజయసాయి…ఏ రకంగా ఉత్తరాంధ్ర టిడిపి నేతలని టార్గెట్ చేశారో అందరికీ తెలిసిందే. వరుసపెట్టి టిడిపి నాయకులపై భూ కబ్జా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అలాగే పలువురు టిడిపి నేతలవి అక్రమ కట్టడాలని కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వంశపారంపర్యంగా వస్తున్న మాన్సాస్, సింహాచల దేవస్థానం ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న అశోక్ గజపతి రాజుని ఎలా టార్గెట్ చేశారో కూడా తెలిసిందే. అయితే విజయసాయి రాజకీయాన్ని అశోక్ సైతం ధీటుగా ఎదురుకుంటున్నారు.

అయినా సరే విజయసాయి, అశోక్‌ని వదలట్లేదు. ఆయనపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన దానం చేసిన భూముల్లోనే ఆయనే అక్రమాలు చేశారని ఆరోపించడం కాస్త విడ్డూరంగానే ఉంది. పైగా ఆయన్ని జైలుకు పంపిస్తామని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే అశోక్‌ని టార్గెట్ చేసిన విజయసాయిని టిడిపి నేతలు రౌండప్ చేసేస్తున్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి నలుగురు బ్రోకర్లు, నలుగురు ఏజెంట్లను పెట్టుకుని దందాలు చేస్తున్నారని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. అవినీతికి పాల్పడి జైలుకెళ్లి వచ్చిన వ్యక్తి అశోక్‌గజపతి రాజుపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని ఫైర్ అవుతున్నారు.

అటు రఘురామకృష్ణంరాజు సైతం విజయసాయిరెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలని, అశోక్ గజపతిరాజును చెడ్డవారన్నంత మాత్రాన విజయసాయిరెడ్డి మంచివాడు కాలేడని, విశాఖలో రూ.100 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారని రఘురామ మాట్లాడుతున్నారు. ఈ విధంగా టిడిపి నేతలే కాదు…రాజు గారు సైతం విజయసాయికి కౌంటర్లు ఇచ్చేస్తున్నారు.

Discussion about this post