మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు టార్గెట్‌గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఉత్తరాంధ్రలో ప్రత్యర్ధుల సైతం విమర్శించని నేతగా ఉన్న అశోక్‌పై విజయసాయి దిగజారి విమర్శలు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఇప్పటికే మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఎదురుదెబ్బలు తిని, ఫ్రస్టేషన్‌లో ఉన్న విజయసాయి, అశోక్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.
పూసపాటి అశోక్ పెద్ద గురువింద గింజలా మారాడని, తన కింద నలుపెరుగకుండా కోటలో కూర్చొని శ్రీరంగనీతులు చెప్తున్నాడని, బాబు హయాంలో 35 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు వదిలేశారంటే ఇప్పుడు నీళ్ళు నములుతున్నారని, మాన్సాస్ ఉద్యోగులను రెచ్చగొట్టి ఈవోపై దాడులు చేయిస్తున్నావంటే ఎంతగా దిగజారావు అశోక్? అంటూ విజయసాయి మాట్లాడారు.అయితే విజయసాయికి తెలుగుదేశం శ్రేణులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నాయి. అసలు విజయసాయిని గురివింద గింజతో పోలిస్తే, ఆ గింజ కూడా సిగ్గుతో బాధపడుతుందని, ప్రతివత పరమాన్నం వండితే తెల్లారితే చల్లార్లేదు అన్నట్లుగా విజయసాయి మాటల ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వమే సరిగ్గా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయకుండా విద్యార్ధుల భవిష్యత్‌తో ఆడుకుంటుందని, ఇక మాన్సాస్ ఉద్యోగులకు గత 16 నెలలుగా జీతాలు ఇవ్వనిది వైసీపీ ప్రభుత్వం నియమించిన ఈవోనే అని, కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తూ జీతాలు ఇవ్వకపోతే, ఉద్యోగులు ఈవోని నిలదీశారని, కానీ ఆ విషయాన్ని కూడా అశోక్‌పై రుద్దాలని చూస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు.
మామూలుగానే రాష్ట్రంలోని ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వలేని వైసీపీ ప్రభుత్వం, మాన్సాస్ ఉద్యోగులని కూడా ఇబ్బంది పెడుతుందని, తప్పు ఇలా క్లియర్‌గా కనబడుతున్న కూడా విజయసాయి, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అశోక్‌పై విమర్శలు చేయడం, ఆయన దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనమని తమ్ముళ్ళు మండిపడుతున్నారు.
Discussion about this post