ఏపీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిది ఒక డిఫరెంట్ రాజకీయం. అందరూ ఒకబాటలో వెళితే విజయసాయి మరో బాటలో వెళ్తారు. వైసీపీ, జగన్‌లు నెగిటివ్ అవుతారు అనుకునే ప్రతి సమయంలో చంద్రబాబుని తిట్టి పాలిటిక్స్ డైవర్ట్ చేయడంతో విజయసాయిది అందె వేసిన చేయి. ప్రస్తుతం ఏపీ-తెలంగాణ ప్రభుత్వాల మధ్య నీటి వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమని చెబుతూ తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. అలాగే వైఎస్సార్, జగన్‌లని తెలంగాణ మంత్రులు తీవ్రంగా తిడుతున్నారు. అయినా సరే వైసీపీ నేతలు, మంత్రులు సున్నితంగా మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టులే అక్రమమని మాట్లాడుతున్నారు.
ఇలా రెండు రాష్ట్రాల మధ్య నీటి రగడ జరుగుతుంది. ఇక ఈ రగడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్-జగన్‌లు డ్రామా ఆడుతున్నారని రెండు రాష్ట్రాల ప్రజలకు అర్ధమైందని మేధావులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఇక వారి మధ్య జరుగుతున్న గొడవలోకి చంద్రబాబుని లాగి తిట్టడం విజయసాయి వంతు అయింది. సీమ ఎత్తిపోతల పథకంతోపాటు జగన్ మొదలు పెట్టిన చిత్తూరు ప్రాజెక్టులపై స్టే కోరుతూ తన వాళ్ళతో చంద్రబాబు గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్లు వేయించారని లేనిపోని ఆరోపణలు చేశారు. అంటే అక్కడ జరుగుతున్న గొడవ ఏంటి, విజయసాయి చేస్తున్న రాజకీయం ఏంటని తెలుగు తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు.
వైఎస్సార్‌ని తిడుతున్నా కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా అనలేని విజయసాయి, బాబు మీద పడి ఏడుస్తున్నారని, హైదరాబాద్‌లో తమ ఆస్తులు ఏమైపోతాయని భయమని కౌంటర్లు ఇస్తున్నారు. చిన్న పిల్లలు అన్నం తినట్లేదంటే దానికి కారణం కూడా బాబే అని విమర్శించే రకం విజయసాయి అని అంటున్నారు. అసలు బాబుని తిట్టడం వల్లే వైసీపీ పార్టీ నడుస్తున్నట్లు ఉందని, ప్రతి అంశంలో బాబుని విమర్శించకపోతే వైసీపీ ఏమైపోతుందనే భయం విజయసాయికి ఉందని మండిపడుతున్నారు. అసలు డైవర్షన్ పాలిటిక్స్‌లో విజయసాయి ముందుంటారని అంటున్నారు.
Discussion about this post