చింతకాయల అయ్యన్నపాత్రుడు….తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకుడు. విశాఖపట్నంలో టీడీపీకి పెద్ద దిక్కులాంటి నేత. ఎందరో నాయకులు మధ్యలో వచ్చి పార్టీలు మారుతూ, మళ్ళీ పార్టీలోకి వచ్చినా సరే, తాను మాత్రం నిఖార్సైన టీడీపీ నాయకుడుగా పనిచేస్తున్నారు. పలుమార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న, టీడీపీలో అనేక కీలక పదవులు చేపట్టారు.
ఇలా టీడీపీలో కీలకంగా పనిచేస్తున్న అయ్యన్న, నెక్స్ట్ తన వారసుడు చింతకాయల విజయ్‌ని ఎలాగైనా ఎన్నికల బరిలో దింపాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లోనే విజయ్ పార్టీ తరుపున పోటీ చేయాల్సి ఉంది. కానీ చంద్రబాబు ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని చెప్పడంతో విజయ్‌కు పోటీ చేయడం కుదరలేదు. అయ్యన్ననే పోటీ చేసి ఓటమి పాలయ్యారు.అటు పార్టీ కూడా ఓడిపోయింది. దీంతో అయ్యన్న పార్టీ కోసం నిత్యం కష్టపడుతూనే ఉన్నారు. ఇదే సమయంలో విజయ్ సైతం తండ్రికి అండగా ఉంటూ, పార్టీ తరుపున పనిచేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నర్సీపట్నం పరిధిలో మళ్ళీ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటున్నారు. జగన్ ప్రభుత్వంపై గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. అవసరమైన వేళ పార్టీ తరుపున బలంగా వాయిస్ వినిపిస్తూ ప్రత్యర్ధులకు చెక్ పెడుతున్నారు.
అసలు గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగిన విషయం తెలిసిందే. కానీ నర్సీపట్నంలో వైసీపీని ఓడించినంత పనిచేశారు. మొత్తం 28 వార్డుల్లో వైసీపీ 14 గెలిస్తే, టీడీపీ గట్టి పోటీ ఇచ్చి 12 వార్డులు గెలిచింది. ఇతరులు 2 చోట్ల గెలిచారు. విజయ్ సైతం కౌన్సిలర్‌గా గెలిచారు. ఇలా నర్సీపట్నం మున్సిపాలిటీలో టీడీపీకి ఊపిరిచ్చేలా విజయ్ పనిచేశారు. కాబట్టి ఇలాంటి యువనాయకుడుకు నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ ఇస్తే పార్టీకే ప్లస్ అవుతుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మరి చూడాలి నెక్స్ట్ విజయ్‌కు సీటు ఫిక్స్ అవుతుందో లేదో..?
Discussion about this post