పార్లమెంట్ సమావేశాలు మొదలైన నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాల్లో కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేశామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ఏడేళ్లు దాటిన కూడా కేంద్రం, విభజన చట్టంలోని హామీలని నెరవేర్చలేదని, తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తుందని అన్నారు. అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాన్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేసినట్లు విజయసాయి చెప్పారు. ఇవే గాకుండా దిశ బిల్లుని క్లియర్ చేయాలని, రఘురామపై అనర్హత వేటు వేయాలని, పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, బియ్యం సబ్సిడీ బకాయిలు…అబ్బో ఇంకా చాలా అంశాల్లో కేంద్రాన్ని గట్టిగా అడిగినట్లు చెప్పారు.
అయితే విజయసాయి చెప్పినట్లు కేంద్రం ఇవన్నీ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. మంచి విషయాలే విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఇక్కడే ఒక అనుమానం వస్తుంది. మీడియా ముందు అన్నీ అంశాలని మాట్లాడిన విజయసాయికి, కేంద్రం ఆ అంశాలు మాట్లాడే సమయం ఇచ్చిందా? అని డౌట్ వస్తుందని అంటున్నారు. అసలు మీడియా ముందే విజయసాయి హడావిడి చేసారేమో అని చెబుతున్నారు.
ఏడు, ఎనిమిది ఏళ్ళు అవుతున్న న్యాయం చేయలేదని, కేంద్రం తెలుగు ప్రజలకు ద్రోహం చేసిందని, కేంద్రం పెద్దల ముందరే విజయసాయి గట్టిగా అడిగారా అని ప్రశ్నిస్తున్నారు. లేకపోతే అక్కడ ఏం మాట్లాడకుండా విజయసాయి మీడియా ముందే హడావిడి చేస్తున్నట్లు కనిపిస్తుందని అంటున్నారు. అంత గట్టిగా అడిగే ధైర్యం విజయసాయికి ఉందంటే నమ్మడం కష్టమే అని చెబుతున్నారు.
Discussion about this post