ఆయనకు ప్రజలంటే విధేయత.. పార్టీ అధినేత అంటే.. ఎనలేని వినయం.. అందుకే ఆయనను అందరూ `వినయ-విధేయ నేత`గా పిలుచుకుంటారు. వరుస విజయాలు దక్కించుకోవడం అంటే.. ప్రజల మనసులు కొల్లగొట్టడం అంటే.. నేటి డిజిటల్ యుగంలో అందరికీ సాధ్యం కాదు. కానీ, ఆయన సాకారం చేసుకున్నారు. తీవ్రమైన జగన్ సునామీ నుంచి.. వైసీపీ పెను హవా నుంచి కూడా గెలిచి.. విజయం దక్కించుకుని.. పార్టీ ఠీవీని రెపరెపలాడించిన నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయనే.. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం.. ఎమ్మెల్యే.. టీడీపీ సీనియర్ నాయకుడు అనగాని సత్యప్రసాద్.

అనగాని.. అంటే.. చాలు..ఇక్కడి ప్రజలు.. ఆనందంతో గంతులు వేస్తారు. కొందరు తమ ఇళ్ల ముందు అనగాని సత్యప్రసాద్ బొమ్మలనుకూడా ముద్రించుకున్నారంటే.. కొన్ని వీధులకు `అనగాని వీధి` అని పేరు పెట్టుకున్నారంటే.. ఆయన ఏ విదంగా ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నారో ఇట్టే అర్ధమవుతుంది. టీడీపీ నాయకుడిగా.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ.. పార్టీ పట్ల ఎందో ఆదరంగా.. పార్టీ అధినేత చంద్రబాబు విషయంలో ఎంతో వినయంగా వ్యవహరించే సత్యప్రసాద్.. రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను 2014లో దక్కించుకుని .. తొలి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావుపై విజయం సాధించారు. ఇక, అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది.

2014-19 వరకు పార్టీ అధికారంలో ఉండడం అనగానికి చాలా వరకు కలిసి వచ్చింది. రేపల్లె నియోజకవర్గంలో మత్స్యకార కుటుంబాలు ఎక్కువ.నియోజకవర్గానికి తీర ప్రాంతం ఉండడంతో వీరి సమస్యలు పరిష్కరించడంలో సత్యప్రసాద్ ముందున్నా రు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించడం.. వారి సమస్యలు ఓపికగా వినడం.. వాటి పరిష్కారానికి కృషి చేయడం.. అనగానిని ప్రజల మనిషిగా నిలబెట్టింది. ఇదే.. గత 2019 ఎన్నికల్లో అనగానికి అద్భుత విజయాన్ని అందించింది. నిజానికి గుంటూరు జిల్లా మొత్తం టీడీపీక్లీన్ స్వీప్ చేస్తుందని అందరూ భావించారు.కానీ, అనూహ్యంగా వైసీపీ సునామీతో ఇక్కడ టీడీపీ చతికిల పడింది. అయినప్పటికీ.. ఇద్దరు మాత్రమే విజయం దక్కించుకున్నారు వీరిలో.. అనగాని ఒకరు.

అయితే.. గత ఎన్నికల తర్వాత..పార్టీ మారాలంటూ.. అనగానిపై ఒత్తిళ్లు వచ్చాయి. నియోజకవర్గంలోనూ ఆయనకు వ్యతిరేకంగా.. మాజీ మంత్రి మోపిదేవి మంత్రాంగం చేశారు. అయినప్పటికీ.. టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల..అనగాని విశ్వాసంతో ఉన్నారు. ఆయన పట్ల వినయంతో వ్యవహరించారు. పార్టీ మారేది లేదని.. తనకు ఎన్నికష్టాలు వచ్చినా.. నష్టాలు వచ్చినా.. టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. అదేసమయంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. తన వద్దకు వచ్చే ప్రజల కష్టాలు విని.. వాటిని పరిష్కరించేందుకు తానే స్వయంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లిన ఘటనలు వున్నాయి. అదేసమయంలో పేదల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేయడం.. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండడం వంటివి అనగానిని.. వినయ-విధేయ సత్యప్రసాద్‌గా నిలబెట్టాయని అంటున్నారు పరిశీలకులు.

ReplyForward |
Discussion about this post