గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 25 పార్లమెంట్ స్థానాల్లో 22 స్థానాల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అయితే ఓడిపోయిన సీట్లలో టిడిపికి సరైన నాయకులు ఇప్పటికీ లేరు. ఎన్నికలై రెండేళ్ళు దాటేసిన కూడా పార్లమెంట్ స్థానాల్లో టిడిపికి ఇంచార్జ్‌లు సరిగ్గా లేరు. పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని పెట్టారు గానీ, ఇంచార్జ్‌లని ఇంకా పెట్టలేదు. అయితే ఇప్పుడుప్పుడే అసెంబ్లీ స్థానాల వారీగా ఇంచార్జ్‌లని ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు.

త్వరలోనే పార్లమెంట్ స్థానాల వారీగా కూడా ఇంచార్జ్‌లని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదే క్రమంలో విశాఖలో క్యాండిడేట్లు దాదాపు ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. విశాఖ పార్లమెంట్‌లో బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ పోటీ చేయడం దాదాపు ఫిక్స్. ఇక అనకాపల్లి పార్లమెంట్ సీటు విషయంలో ఇంకాస్త క్లారిటీ రావాల్సిన అవసరముంది. గత ఎన్నికల్లో ఈ స్థానంలో ఓటమి పాలైన ఆడారి ఆనంద్ వైసీపీలోకి వెళ్ళిపోయారు.

దీంతో ఈ సీటు ఖాళీగా ఉంది. ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడుగా బుద్దా నాగజగదీశ్వరరావు పని చేస్తున్నారు. ఈయనకే ఆ సీటు ఫిక్స్ చేస్తారా లేక వేరే క్యాండిడేట్‌ని పెడతారా? అనే అంశంపై పూర్తి క్లారిటీ రావడం లేదు. అటు అరకు పార్లమెంట్ స్థానంలో గుమ్మడి సంధ్యారాణి పేరు దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తోంది. 2014లో ఈమె అరకు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో కిషోర్ చంద్రదేవ్‌కు సీటు ఇచ్చారు.

అయితే ఓడిపోయాక రాజకీయాల్లో అడ్రెస్ లేకుండా వెళ్లిపోయారు. దీంతో అరకు పార్లమెంట్ అధ్యక్షురాలుగా గుమ్మడి సంధ్యారాణిని నియమించారు. ఇక ఆమె మళ్ళీ అరకు స్థానంలో పోటీ చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. పైగా ఇక్కడ టిడిపికి మరొక ఆప్షన్ కూడా లేదు. మొత్తానికైతే విశాఖలో అభ్యర్ధులు దాదాపు ఫిక్స్ అయిపోయినట్లే అని చెప్పొచ్చు.

Discussion about this post