వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక కూల్చుడు, పంచుడు, అమ్ముడు అన్నట్లుగానే పాలన సాగుతోందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం విశాఖ మీద ప్రేమను చాలా గొప్పగా చాటుకుంటోందన్న్న సెటైర్లు జనం నుంచి వస్తున్నాయి.అదెలాంగంటే విశాఖలో ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు తాకట్టు పెట్టడం. వాటిని ష్యూరిటీగా చూపించి అప్పులు తెచ్చుకుంటారుట. మరి ఆ ఆస్తులు ఏంటి అంటే విశాఖ కలెక్టరేట్. ఇది సువిశాలమైన ప్రదేశంలో ఉంది. బ్రిటిష్ వారి ఏలుబడిలోని అద్బుతమైన రాతి కట్టడం ఇది. విశాఖలో హార్ట్ ఆఫ్ ది సిటీలో కలెక్టరేట్ ఉంది. దీన్ని తాకట్టు పెట్టడం అంటే విశాఖ ఆత్మను అమ్ముకోవడమే అని విపక్షాలు గట్టిగనే సర్కార్ ని హెచ్చరిస్తున్నాయి.
ఇక విశాఖలో ఉన్న సువిశాలమైన టర్నర్ సత్రం స్థలాలు, ఇవి కూడా ప్రాచీనమైనవి. వీటిని తాకట్టు పెడితే అవి చివరకు వాకట్టు గా మారి అమ్ముడు పోతాయి తప్ప సర్కార్ తిరిగి విడిపించడం ఉండదని అంటున్నారు. అదే విధంగా టూరిజం స్పాట్స్ గా ఉన్న వాటిని, బీచ్ రోడ్డులో ఖాళీ స్థలాలను కూడా తాకట్టు పెట్టేందుకు సర్కార్ రెడీ అయిపోతోంది. దీని మీద స్థానిక ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే కొత్తగా నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ ఆస్థూలను పెంచాలి తప్ప ఉన్న వాటిని తెగనమ్మడమేంటని మండిపడుతున్నారు. మరో వైపు తెలుగుదేశం కూడా దీని మీద భారీ పోరాటానికి సిధ్ధపడుతోంది. విశాఖను పాలనా రాజధనిగా చేస్తామని చెప్పడం అమ్ముకోవడానికా అని నాయకులు మండిపడుతున్నారు.
ఒక వైపు కేంద్రం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని దూకుడు మీద ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కనీస మాత్రంగా కూడా స్పందించడం లేదని ఉక్కు కార్మికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద విశాఖను ఏం చేద్దామనుకుంటున్నారు అన్న ప్రశ్న స్థానికంగా ఉన్న మేధావుల నుంచి, ప్రజా సంఘాల నుంచి వస్తోంది. ఆస్తులు తెగనమ్మే పాలన మాకు అక్కరలేదు అని అంతా ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు. మరి దీనికి సర్కార్ ఏ రకమైన సమాధానం చెబుతుందో చూడాలి.
Discussion about this post