2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ఓడిపోయిన దగ్గర నుంచి విశాఖపట్నంపై పట్టు సాధించాలని జగన్, విజయసాయిలు ఎలాంటి రాజకీయాలు చేశారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విజయసాయిరెడ్డి విశాఖలోనే మకాం వేసి, దూకుడుగా రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఎలాగైనా విశాఖని కైవసం చేసుకోవాలని అన్నీ రకాలుగా ప్రయత్నించి, 2019 ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. ఆ ఎన్నికల్లో విశాఖలో వైసీపీకి 15 అసెంబ్లీ సీట్లకు గాను, 11 గెలుచుకోగా, మూడు ఎంపీ సీట్లు గెలుచుకుంది. విశాఖ నగరంలో ఉన్న నాలుగు సీట్లు టీడీపీ గెలుచుకుంది.
అయితే ఓడిపోయినా కూడా టీడీపీ సంస్థాగతంగా చాలా బలంగా ఉందని చెప్పి, అధికారంలోకి వచ్చి కొత్త వ్యూహాలతో ముందుకొచ్చారు. అందులో భాగంగానే మూడు రాజధానులు తీసుకొచ్చి, విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని ప్రకటించారు. ఇక టీడీపీ నేతల టార్గెట్‌గా విజయసాయి ఎలాంటి రాజకీయాలు చేశారో కూడా తెలిసిందే. టీడీపీ నేతలపై అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. భూ కబ్జాలు, అక్రమ కట్టడాలని చెప్పి టీడీపీ నేతలకు చెప్పిన బిల్డింగులని కూల్చేశారు.
ఇలా చాలా రకాలుగా విజయసాయి, టీడీపీని ఇబ్బంది పెట్టడానికి చూశారు. అయినా సరే విశాఖలో టీడీపీ బలం తగ్గలేదని తెలుస్తోంది. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖలో వైసీపీ గెలిచినా సరే టీడీపీ గట్టి పోటీ ఇచ్చి 30 డివిజన్లు సొంతం చేసుకుంది. అంటే అధికారంలో లేకపోయిన టీడీపీకి అన్నీ స్థానాలు వచ్చాయంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
పైగా రాజధాని పేరుతో విశాఖ విజయసాయి అండ్ బ్యాచ్ చేసే అక్రమాలకు అంతు లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా ఉండే విశాఖలో కబ్జాలు, సెటిల్‌మెంట్లు, దందాలు ఎక్కువైపోయాయని ఆ ప్రాంత వాసుల నుంచి అసంతృప్తి వస్తుంది. అసలు మొత్తానికి ఇక్కడ టీడీపీని దెబ్బకొట్టాలనుకుని, వైసీపీనే దెబ్బతినేలా కనిపిస్తోంది.
Discussion about this post