మొన్నటివరకు బలంగా ఉన్న విశాఖ నగరంలో ఇప్పుడు టీడీపీ బలం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. రాజకీయంగా పరిణామాలు ఎలా మారినా సరే పార్టీని నిలబెట్టుకోవాల్సిన అధినేత చంద్రబాబుదే. కానీ అధినేత ఆ దిశగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. అందుకే నగరంలో టీడీపీ వీక్ అవుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ గాలి ఎంత బలంగా ఉన్నా సరే విశాఖ నగరంలో నాలుగు సీట్లు టీడీపీనే గెలుచుకుంది.

విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సీట్లు టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ, నగరంలో టీడీపీని వీక్ చేయడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. ఈ క్రమంలోనే రాజధాని పేరుతో విశాఖలో టీడీపీని దెబ్బకొట్టడానికి చూసింది. అలాగే టీడీపీ నేతలపై భూ కబ్జా ఆరోపణలు చేస్తూ, కొందరిని నయానో, భయానో పార్టీలోకి లాక్కున్నారు.ఇలా వైసీపీ రాజకీయం వల్ల నగరంలో టీడీపీ కాస్త వీక్ అయిందనే చెప్పొచ్చు. అయితే వీక్ అయిన పార్టీని బలోపేతం చేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు లేరు. ముఖ్యంగా విశాఖ సౌత్ నుంచి గెలిచిన వాసుపల్లి గణేశ్ వైసీపీలోకి జంప్ కొట్టిన విషయం తెలిసిందే. వాసుపల్లి వైసీపీ వైపుకు వెళ్ళాక, అక్కడ టీడీపీని నడిపించే నాయకుడు లేరు. చంద్రబాబు సైతం అక్కడ ఇంచార్జ్‌ని పెట్టలేదు. అటు నార్త్‌లో గంటా శ్రీనివాసరావు అసలు పార్టీలోనే కనిపించడం లేదు. అక్కడ కూడా పార్టీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది.

వెస్ట్‌లో గణబాబు పార్టీతో పెద్దగా సంబంధం లేదన్నట్లుగా పనిచేసుకుంటూ వెళుతున్నారు. ఈస్ట్‌లో వెలగపూడి రామకృష్ణ ఒక్కరే పార్టీలో దూకుడుగా పనిచేస్తున్నారు. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో పార్టీని సరిచేయాల్సిన బాధ్యత చంద్రబాబుదే. మరి విశాఖ సిటీలో బాబు సైకిల్‌ని నిలబెడతారో లేదో చూడాలి.
Discussion about this post