రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో నిదానంగా వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకిత మొదలవుతుందని తెలుస్తోంది. ఈ రెండేళ్లలో వైసీపీ కేవలం పథకాలు మీదే బండి నడుపుకుంటూ వచ్చింది. దీంతో ఎక్కడా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం జరగట్లేదు. ఏదో అప్పులు చేసి పథకాలు ఇస్తూ, మళ్ళీ ఆ డబ్బులని పన్నుల రూపంలో జనం దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు. అదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల దోపిడికి అంతే లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకిత మొదలైందని తెలుస్తోంది.
ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్న కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు అంత బాగోలేదని తెలుస్తోంది. జిల్లాలో పది సీట్లు ఉంటే, పది సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. మరి వీరిలో ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలిన ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు ఏ మాత్రం సంతృప్తిగా లేరని తెలుస్తోంది. ఏదో జగన్ ఇమేజ్ మీద వారి బండి నడిపిస్తున్నారని, లేదంటే వారికి అంత సీన్ లేదని తెలుస్తోంది.
పైగా పలువురు ఎమ్మెల్యేలు చేస్తున్న అక్రమాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మైనింగ్, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు, కాంట్రాక్ట్‌ల్లో అడ్డగోలుగా దోపిడి చేయడం, నియోజకవర్గాల్లో దందాలు ఇలా చెప్పుకుంటూ పోతే కొందరు ఎమ్మెల్యేలు చేసే కార్యక్రమాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. అందుకే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజల్లో బాగా నెగిటివ్ వచ్చినట్లు కనిపిస్తోంది.
ఇక్కడ విచిత్రం ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యేలకు ఉన్నా సరే, జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ నేతలకు పాజిటివ్ కూడా లేదని తెలుస్తోంది. ఏదో ముగ్గురు, నలుగురు మినహా మిగిలిన టీడీపీ నేతలు అంత ఎఫెక్టివ్‌గా పనిచేయడం లేదని తెలుస్తోంది. అసలు వైసీపీ ఎమ్మెల్యేలు మీద వ్యతిరేకిత ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకుని బలపడే స్థాయిలో టీడీపీ నేతలు లేరు.
Discussion about this post