మనం చేయని పనులని చేసినట్లు చెప్పుకోవడం, ఉన్నవాటిని లేనట్లుగా క్రియేట్ చేయడం, అబద్దాలు చెప్పడం, ఫేక్ ప్రచారం చేయడం, కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయించుకోవడం..అబ్బో ఇలాంటివన్ని వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు అయిపోయింది. ఇక వైసీపీ ప్రచారం ఏ స్థాయికి వెళ్ళిందంటే..నేషనల్ మీడియా సంస్థలకు డబ్బులు ఇవ్వడం, వాటి చేత అనుకూలంగా ప్రచారం చేయించుకోవడం. అంటే నేషనల్ మీడియా కూడా తమ గురించి గొప్పగా చెప్పిందని వైసీపీ డప్పు కొట్టుకోవడం చేస్తుంది.
తాజాగా నేషనల్ మీడియా టైమ్స్ నౌ సంస్థ ఓ సర్వే విడుదల చేసింది. ఈ సర్వేలో జాతీయ స్థాయిలో బిజేపి మళ్ళీ బిజేపి గెలుస్తుందని తేల్చి చెప్పింది. బీజేపీ కూటమి(ఎన్డీఏ)కి 292-338 సీట్లు వచ్చే అవకాశం ఉందని.. కాంగ్రెస్ పార్టీ కూటమికి 106-114 సీట్లు రావచ్చని అంచనా వేసింది. టీఎంసీకి 20-22, ఇతరులకు 66-96 వరకు సీట్లు రావచ్చని పేర్కొంది.

ఇక ఏపీలో వైసీపీకి 24-25 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది. అయితే కాస్త రియాలిటీకి దగ్గరగా ఉండేలా సీట్లు వస్తాయని చెబితే ప్రజలు నమ్ముతారు. అలా కాకుండా ఏపీలో ఉన్నవే 25 ఎంపీ సీట్లు..ఆ సీట్లు అన్నీ వైసీపీ గెలుచుకుంటుందని చెప్పడం దారుణమైన పబ్లిసిటీ. గత ఎన్నికల్లోనే అనేక అబద్దాలు చెప్పి 22 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు.
కానీ ఇప్పుడు వైసీపీని ప్రజలు నమ్మే పరిస్తితి కనిపించడం లేదు. కేంద్రం నుంచి జగన్ గాని, వైసీపీ ఎంపీలు సాధించింది ఏమి లేదు..ఎంపీలపై వ్యతిరేకత ఉంది. ఇక పది సీట్లు గెలిస్తే గొప్ప అనుకునే పరిస్తితి. అలాంటి తరుణంలో నేషనల్ మీడియా..24-25 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పడం..పెయిడ్ పబ్లిసిటీ అని అర్ధమైపోయింది. ఇదివరకే వైసీపీ..నేషనల్ మీడియా టైమ్స్ నౌకు 8 కోట్లు ఫండింగ్ ఇచ్చిందని కథనాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు ఇలా డప్పు కొడుతున్నారని అంటున్నారు.