సోము వీర్రాజు…పేరుకే ఏపీ బీజేపీ అధ్యక్షుడు అని, ఈయన పూర్తిగా వైసీపీకే అనుకూలమనే ఎప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి. గత ఎన్నికల ఫలితాల తర్వాత కన్నా లక్ష్మినారాయణ అధ్యక్షుడుగా ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి పోరాటం చేశారో అందరికీ తెలిసిందే. అయితే ఇలా వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న కన్నాని బీజేపీ అధిష్టానం తప్పించి, వైసీపీకి ఎప్పుడు అనుకూలంగా ఉండే సోము వీర్రాజుని అధ్యక్షుడుగా నియమించింది.

ఇక వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక పూర్తిగా వైసీపీని కాపాడుతూనే వస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా ఈయన అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేయకుండా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీనే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏమన్నా తప్పు చేస్తే, గతంలో చంద్రబాబు ఇలా చేశారు…అలా చేశారని మీడియాలో మాట్లాడతారు.

పైగా వైసీపీ మీద పోరాటం చేసే కొందరు బీజేపీ నాయకులని కూడా ఈయన సైడ్ చేసేశారని తెలుస్తోంది. అధ్యక్ష పదవి వచ్చిన మొదట్లోనే పలువురి నాయకులపై వేటు కూడా వేశారు. ఇలా పక్కాగా వైసీపీకి అనుకూలంగా నడుస్తున్న సోముకు ఇప్పుడు కొత్త కష్టాలు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ పరిస్తితి అంతంత మాత్రమే. ఇక సోము వచ్చాక మరీ ఘోరంగా తయారైంది. కన్నా ఉన్నప్పుడు కొందరు టీడీపీ నేతలైన బీజేపీలో చేరారు. కానీ సోము వచ్చాక ఆ పార్టీలోకి వలసలు ఆగిపోయాయి.

ఇలా అన్నివిధాల వైసీపీకి పరోక్షంగా సహకరిస్తున్న సోముకు బీజేపీ అధిష్టానం అతి త్వరలోనే చెక్ పెట్టనుందని తెలుస్తోంది. సోముని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి, మళ్ళీ కన్నాకే బాధ్యతలు అప్పగించాలని బీజేపీ చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అనుకుంటా ఈ మధ్య సోము కాస్త వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. అయితే ఎంత ఫైర్ అయిన సోము వైసీపీని కాపాడబోయి, ఇరుక్కుపోయారని, ఆయన పదవి ఊడటం ఖాయమని ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి సోము పదవి ఏం అవుతుందో?
ReplyForward |
Discussion about this post