వైసీపీ పదవుల కోసం, సీటు కోసం నేతలు ప్రతిపక్షాలని ఎంతవరకైనా తిట్టేలా ఉన్నాయి. ఇక ప్రతిపక్ష నేతలని ఎంత ఎక్కువ తిడితే అంత త్వరగా పదవులు వస్తాయనే పాలసీ వైసీపీలో నాదుస్తోంది. అందుకే నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి సోషల్ మీడియాలో నాలుగు డైలాగులు మాట్లాడి..దానికి కేజిఎఫ్ ఎలివేషన్లు ఇచ్చి హైలైట్ అయిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సైతం చంద్రబాబుని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాడు.
ఇక పెద్ద నేతల తరహాలో ఎగతాళి చేసి మాట్లాడటం, తిట్టడం చేస్తున్నాడు. తాజాగా తాడిపత్రికి వెళ్ళిన బైరెడ్డి..అక్కడ దశాబ్దాల పాటు రాజకీయం చేస్తున్న జేసి బ్రదర్స్ పైన విమర్శలు చేయడం ఆశ్చర్యంకరంగా మారింది. అదేమంటే జేసి బ్రదర్స్ వైసీపీలోకి రావాలని చూస్తున్నారని, వారి వారసులు సైతం వైసీపీలోకి రావాలని అనుకుంటున్నారని, కానీ తాము రౌడీయిజం చేసేవాళ్లని తమ పార్టీలోకి రానివ్వమని బైరెడ్డి డైలాగులు వేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాకే తాడిపత్రిలో దౌర్జన్యాలు ఆగాయని చెప్పుకొచ్చిన బైరెడ్డి.. బస్సులు అక్రమంగా నడిపి సామాన్యుల ప్రాణాలు తీసారని జేసి బ్రదర్స్ పై మండిపడ్డాడు.

అలాగే చంద్రబాబుపై కూడా బైరెడ్డి కామెంట్ చేశాడు. చంద్రబాబుని కుప్పం ప్రజలు 40 ఏళ్లపాటు గెలిపిస్తే.. ఏనాడూ అక్కడి ప్రజలను పట్టించుకోలేదని, కానీ జగన్ దెబ్బతో ఇప్పుడు నెలకోసారి కుప్పం పర్యటనలు పెట్టుకున్నారని ఎద్దేవా చేశాడు. టీడీపీకి 75-80 నియోజకవర్గాల్లో అభ్యర్దులు లేరని, రాయలసీమలోని 30 నియోజకవర్గాల్లో టీడీపీ బీ ఫాం ఇచ్చినా పోటీకి సిద్దంగా ఎవరూ లేరని ఎగతాళి చేశాడు.
అంటే రాజకీయంగా చంద్రబాబు, జేసి బ్రదర్స్ నాలుగు దశాబ్దాల నుంచి ఉన్నారు..బైరెడ్డి వయసు 30 కూడా ఉండవు..కానీ వారిని ఎగతాళి చేసేలా మాట్లాడటం కాస్త ఓవర్ పాలిటిక్స్ అనే చెప్పాలి. అంటే నెక్స్ట్ వైసీపీలో సీటు కోసమే ఇలా బైరెడ్డి మాట్లాడుతున్నాడని తెలుస్తోంది.