రాజకీయ నాయకులకు ఎప్పుడు అధికారమే కావాలి. అధికారం లేకపోతే కొందరు నాయకులు బండి లాగించలేరు. పైగా వారి వ్యాపారాలకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. అందుకే టీడీపీ అధికారం కోల్పోయాక, చాలామంది నాయకులు వైసీపీలోకి జంప్ కొట్టారు. మరి ఇలా జంప్ కొట్టినవారంతా ప్రజల బాగోగులు కోరి పార్టీ మారారు అంటే నమ్మడానికి ప్రజలు కూడా సిద్ధంగా లేరనే చెప్పొచ్చు. సొంత ప్రయోజనాలు కోసమే ఏ నాయకుడైన పార్టీ మారుతారు అందులో ఎలాంటి డౌట్ లేదు.

మరి అలా పార్టీ మారిన వారు వైసీపీలో మంచి పొజిషన్‌లోనే ఉన్నారా? అంటే కొందరు ఉన్నారు….కొందరు లేరనే చెప్పొచ్చు. ముఖ్యంగా టీడీపీని వదిలి వైసీపీలోకి వెళ్ళిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావుకు ఇంతవరకు ఏ పదవి రాలేదు. 2014లో దర్శి అసెంబ్లీ నుంచి గెలిచిన శిద్ధాకు చన్ద్ర్బాబు మంత్రి పదవి ఇచ్చారు. ఐదేళ్ల పాటు శిద్ధా హవా బాగానే నడిచింది. ఇక 2019 ఎన్నికల్లో శిద్ధా ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.ఓడిపోయాక తన తనయుడు సుధీర్‌ని తీసుకుని వైసీపీలోకి వెళ్లారు. అక్కడ నుంచి శిద్ధా ఫ్యామిలీ పెద్దగా ఏపీ రాజకీయాల్లో కనిపించిన సందర్భాలు లేవు. అలా అని వారికి ఎలాంటి పదవులు కూడా రాలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో వీరికి ఏదొక సీటు వస్తుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే దర్శికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అటు ఒంగోలుకు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. వారే కాకుండా ఆ స్థానాలకు పలువురు నేతలు పోటీలో ఉన్నారు.

మరి ఇలాంటి పరిస్తితుల్లో శిద్ధా ఫ్యామిలీకి వైసీపీలో సరైన న్యాయం జరగడం కష్టమే అని తెలుస్తోంది. ఇక టీడీపీలో ఉంటే వీరికి చంద్రబాబు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో చెప్పాల్సిన పని లేదు. ఏదేమైనా శిద్ధా ఫ్యామిలీ వైసీపీలోకి ఇరుక్కుపోయినట్లే కనిపిస్తోంది.
Discussion about this post