లక్ష్మీపార్వతి….రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు రెండో భార్య. బుర్రకథలు, హరికథలు చెప్పుకుంటూ, ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాయడానికి ఆయన దగ్గరకొచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో అందరికీ తెలిసిందే. అయితే లక్ష్మీపార్వతి పూర్తిగా తెలుగు బాషాభిమాని. ఆమెకు తెలుగు బాష మీద పట్టునే చూసే ఎన్టీఆర్ సైతం ఇష్టపడ్డారు. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా తెలుగు బాషని ఎంత అభిమానించేవారో అందరికీ తెలిసిందే. తెలుగు అంటే ఎన్టీఆర్…ఎన్టీఆర్ అంటే తెలుగు అనే విధంగా ఉండేది.
కానీ ఇప్పుడు తెలుగు బాషకు ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో కూడా లక్ష్మీపార్వతి ఏమి మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇంగ్లీష్ మీడియంతో పాటు, తెలుగు మీడియం కూడా ఉండాలని ప్రతిపక్షాలు, తెలుగు పండితులు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. కానీ వారి మాటలని ప్రభుత్వం పట్టించుకోకుండా ముందుకెళుతుంది. ఇక తెలుగు బాషని ఎంతగానో అభిమానించే లక్ష్మీపార్వతి సైతం ఈ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.ఇదిలా ఉంటే ఇటీవల తెలుగు అకాడమీ పేరుని, తెలుగు-సంస్కృత అకాడమీగా ఏపీ ప్రభుత్వం పేరు మార్చింది. దీనిపై కూడా లక్ష్మీపార్వతికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేకుండా పోయినట్లు కనిపిస్తోంది. అకాడమీ ఛైర్మన్‌గా ఉంటూ, పేరుని మార్చిన సరే సమర్ధించుకోవాల్సిన పరిస్తితి వచ్చింది. పైగా దీన్ని సమర్ధించుకోవడానికి తెలుగు-సంస్కృత బాషలు పేక ముక్కలుగా కలిసి ఉంటాయని నోరు జారీ అభాసు పాలయ్యారు.
అయితే వైసీపీలో పూర్తి స్వేచ్చ లేకే లక్ష్మీపార్వతి ఈ విధంగా ఆ పార్టీ చెప్పినట్లు మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. పైగా రాజకీయంగా ఆమె ఎమ్మెల్సీ పదవి ఆశించిన ఇవ్వలేదు. అకాడమీ ఛైర్మన్ ఇచ్చారు. అది కూడా స్వేచ్ఛ లేకుండా, ఎక్కడక్కడ ఆమె గొంతుని వైసీపీ నోక్కేస్తున్నట్లే కనిపిస్తోందని తెలుస్తోంది.
Discussion about this post