ఏపీ ప్రజలకు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు గురించి తెలిసే ఉంటుంది. గత ఎన్నికల ముందు ఆయన ఏ విధంగా హడావిడి చేశారో కూడా తెలిసిందే. వైసీపీలో చేరి బాగా హడావిడి చేసి, ఎన్నికలైన తర్వాత అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు. అయితే చంద్రబాబుకు నార్నే దగ్గర బంధువు అనే సంగతి తెలిసిందే. ఆ బంధుత్వంతోనే నార్నే కుమార్తె ప్రణతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారని సినీ, రాజకీయాల్లో ఎప్పుడు చర్చ నడుస్తూ ఉంటుంది.

ఇక బంధుత్వం విషయం పక్కనబెడితే, గతంలో నార్నే, టిడిపికి సపోర్ట్‌గానే ఉన్నారు. బయట రాజకీయాల్లో పెద్దగా కనబడకపోయిన పరోక్షంగా నార్నే చంద్రబాబుకు మద్ధతుగానే ఉండేవారు.అయితే చాలా సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో కనిపించలేదు. కానీ 2019 ఎన్నికల ముందు నార్నే ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పైకి వచ్చారు. హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. చేరిందే తరువాయి చంద్రబాబుపై విమర్శలు కూడా చేశారు.

ఇక జగన్ ఆదేశిస్తే మంగళగిరిలో పోటీ చేసి లోకేష్‌ని ఓడిస్తానని హడావిడి చేశారు. అయితే మంగళగిరి కాకపోయిన గుంటూరు జిల్లాలో నార్నేకు ఏదొక సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ నార్నేకు ఏ సీటు రాలేదు. ఇక ఎన్నికల జరిగే వరకు నార్నే హడావిడి ఏపీలో కొనసాగింది. ఇక ఎన్నికలైపోయాయి…జగన్ గెలిచి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత నుంచి నార్నే అడ్రెస్ లేరు.

ఆయనకు వైసీపీలో ఎలాంటి పదవి కూడా దక్కలేదు. అంటే ఎన్నికల ముందు మోహన్ బాబు ఎలాగైతే హడావిడి చేసి చంద్రబాబుపై నెగిటివ్ తీసుకురావాలని ప్రయత్నించారో నార్నే కూడా అలాగే చేసినట్లు కనిపిస్తోంది. అందుకే ఎన్నికలైపోయాక నార్నే సైడ్ అయిపోయారని తెలుస్తోంది.

Discussion about this post