సజ్జల రామకృష్ణారెడ్డి…ఏపీ ప్రభుత్వ సలహాదారు. ఇక సలహాదారు పని అంటే, సీఎం జగన్‌కు మంచి విషయాల్లో సలహాలు ఇస్తూ ఉండాలి. సలహాదారులు రాజకీయాల్లో జోక్యం చేసుకోరు. కానీ ఇక్కడ సజ్జల వ్యవహారం పూర్తిగా విరుద్ధంగా సాగుతుందని తెలుస్తోంది. సీఎం తర్వాత అంతా తానే అనుకునే విధంగా సజ్జల ముందుకెళుతున్నారని టీడీపీ శ్రేణులు మొదట నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. సీఎం జగన్ పెద్దగా బయటకు రారు. మీడియా సమావేశాలు కూడా పెద్దగా పెట్టరు.
అలాంటప్పుడు సంబంధిత మంత్రులు ప్రజల్లో తిరగాలి, అలాగే మీడియా సమావేశాలు పెట్టాలి. కానీ ఏ శాఖకు సంబంధించిన సజ్జల మీడియా సమావేశం పెట్టడం, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై రాజకీయ పరమైన విమర్శలు చేస్తూ ఉంటారు. అలాగే ఈయనే సూపర్ హోమ్ మంత్రిగా ముందుకెళుతున్నారని టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించేది సజ్జలనే అని ఆరోపిస్తున్నారు.సజ్జల మీద ప్రత్యర్ధి పార్టీ టీడీపీ ఆరోపణలు చేస్తే పర్లేదు. సొంత వైసీపీలోనే సజ్జల పట్ల అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఏ మంత్రి అయినా సీఎంని కలవాలంటే ముందు సజ్జలనే అడగాలని విధంగా రాజకీయం నడుస్తుంది. అన్నీ శాఖలో సజల్ల తలదూర్చడం పట్ల మంత్రులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఏదైనా ఓపెనింగ్ కార్యక్రమాలు ఉంటే సజ్జలనే రిబ్బన్ కటింగ్‌లు చేస్తున్నారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో హోమ్ మంత్రి సుచరిత ఉండగానే సజ్జల రిబ్బన్ కటింగ్ చేసేశారు. తాజాగా గుంటూరులో పలు కార్యక్రమాల్లో సజ్జల పాల్గొన్నారు. వాటిల్లో హోమ్ మంత్రికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. సుచరిత ఓ సామాన్య కార్యకర్తగా ఉండిపోయారు. అలాగే హోమ్ శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఈయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అంటున్నారు. మొత్తానికి వైసీపీ ప్రభుత్వంలో అంతా సజ్జల మయం అయిపోయిందని అంటున్నారు.
Discussion about this post