ఏపీ ప్రజల్లో మార్పు మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ముందుకు కదులుతున్నారు. ఎక్కడికక్కడ వైసీపీ నేతలు చేసే అక్రమాలు పెరిగిపోవడంతో ప్రజల్లో తిరుగుబాటు మొదలయింది. ఇప్పటికే వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో సగం పైనే ఎమ్మెల్యేలపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. వారు చేసే అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పుతున్నారు. అలాగే వారిని తరిమి తరిమి కొడుతున్నారు. ఇప్పటికే ప్రజలని అడ్డంగా దోచుకుంటున్న పలువురు వైసీపీ ఎమ్మెల్యేలని ప్రజలు తరిమికొట్టారు. తాజాగా ప్రజలు బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చినఅప్పలనాయుడుపై విరుచుకుపడ్డారు. తాజాగా బొబ్బిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగనన్న కాలనీకి శంకుస్థాపన చేసేందుకు వచ్చారు.
కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. కేవలం ఇళ్ల స్థలాలని వైసీపీ వారికే కేటాయించారని చెప్పి, వూరి ప్రజలు ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ లోపే పెద్ద ఎత్తున యువత, మహిళలు అక్కడకి చేరుకుని ఎమ్మెల్యే కారుని వెళ్లనివ్వలేదు. దీంతో ఎమ్మెల్యే భయపడి పోలీస్ జీప్‌లో దాక్కున్నారు. అసలు వూరు వూరంతా ఏకమై ఎమ్మెల్యేని అడ్డుకోవడంతో పోలీసులు సైతం ఏం చేయలేకపోయారు. అక్కడున్న టెంట్లు, కుర్చీలు కూడా తీసేశారు. దీంతో ఎమ్మెల్యే చేసేది ఏమి లేక ఆ కార్యక్రమాన్ని మమ అనిపించారు. ఎమ్మెల్యే భయపడి తిరిగి వెళ్లిపోతున్న కూడా గ్రామస్తులు ఆయన వెంట పడ్డారు.
ఇక కేవలం బొబ్బిలిలోనే కాదు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి ఉంది. ఇప్పటికే జగనన్న కాలనీల పేరిట వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇళ్ల స్థలాల్లో భారీగా అవినీతి చేశారని, అలాగే సొంత పార్టీ కార్యకర్తలకే పట్టాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఏదేమైనా వైసీపీకి వ్యతిరేకంగా ప్రజల గళం విప్పడం మొదలుపెట్టారు.
Discussion about this post