ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి సినీ గ్లామర్ చాలా తక్కువ. సినిమా వాల్లు ముందు నుంచి ప్రతిపక్ష టీడీపీలోనే ఎక్కువుగా ఉండడమో లేదా టీడీపీకి సపోర్ట్ చేయడమో చేస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికలకు ముందు మాత్రం సినిమా వాళ్లు చాలా మంది జగన్‌కు సపోర్ట్ చేశారు. మరి కొందరు ఓపెన్‌గానే ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే నగరి నుంచి సినీ నటి రోజా వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక ప్రముఖ కమెడియన్ పృథ్వికి జగన్ ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే కొంత కాలానికే జగన్ పృథ్విని ఆ పదవి నుంచి తప్పించారు. ఇక రాజ్యసభ సీటు కోసం మోహన్ బాబు బాగానే ట్రై చేశారని, అది జగన్ ఇవ్వలేదని ఆయన అలిగారని చెబుతారు. ఇక సీనియర్ కమెడియన్ ఆలీ ఎమ్మెల్సీ తో అనేక పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నా వారెవ్వరి ప్రయత్నాలు ఫలించడం లేదు.

ఇదిలా ఉంటే మరో మహిళా కమెడియన్ అయిన రమ్య శ్రీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు భోగట్టా ? ఆమె స్వస్తలం విశాఖ జిల్లా మాడుగుల. పైగా అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామానాయుడుతో పాటు గత ఎన్నికల్లో అక్కడ జనసేన నుంచి పోటీ చేసిన నేత ఇద్దరూ కూడా రమ్య శ్రీకి స్వయానా సోదరులు. అయితే ఇప్పుడు సోదరుల బాటలోనే ఆమె కూడా పొలిటికల్ ఎంట్రీ ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే అక్కడ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ముత్యాల నాయుడు వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన్ను కదని జగన్ రమ్య శ్రీకి ఎమ్మెల్యే సీటు ఇస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.
Discussion about this post