కర్నూలు జిల్లా అంటేనే వైసీపీకి కంచుకోట లాంటి జిల్లా. గత రెండు ఎన్నికల్లోనూ ఈ జిల్లాలో వైసీపీదే లీడింగ్. 2014 ఎన్నికల్లో జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 11 సీట్లు గెలుచుకోగా, టీడీపీ 3 సీట్లు గెలుచుకుంది. ఇక రెండు ఎంపీ స్థానాల్లోనూ నాడు వైసీపీ విజయం సాధించింది. పైగా అప్పుడు నంద్యాల ఎంపీని వైసీపీ ఏకంగా లక్ష ఓట్ల పై చిలుకు భారీ మెజార్టీతో గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో జిల్లా మొత్తం వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. ఇక్కడ టీడీపీకి గుండు సున్నా మిగిలింది. అయితే ఇప్పుడుప్పుడే జిల్లాలో టీడీపీకి మంచి అవకాశాలు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది. ఈ రెండేళ్లలో జిల్లాలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకిత వస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే వైసీపీకి కంచుకోటలుగా ఉన్న మూడు నియోజకవర్గాల్లో టీడీపీకి లీడ్ వచ్చినట్లు తెలుస్తోంది. అలా టీడీపీకి ప్లస్ అవుతున్న నియోజకవర్గాలు వచ్చి కోడుమూరు, ఆలూరు, మంత్రాలయం స్థానాలు. గత రెండు ఎన్నికల నుంచి ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీనే గెలుస్తూ వస్తుంది. ఆలూరు నియోజకవర్గంలో గుమ్మనూరు జయరాం రెండుసార్లు గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న జయరాంపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకిత వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇక్కడ టీడీపీ నాయకురాలు కోట్ల సుజాతమ్మకు బాగా ప్లస్ అవుతుంది.

అటు మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి వైసీపీ తరుపున రెండుసార్లు గెలిచారు. ఇప్పుడు ఈయనపై కూడా నియోజకవర్గంలో వ్యతిరేకిత పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తోంది. నియోజకవరంలో అక్రమాలు కూడా ఎక్కువైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇక్కడ టీడీపీ తరుపున పోరాడుతున్న తిక్కారెడ్డికి కలిసొస్తుంది. అటు కోడుమూరులో ఎమ్మెల్యే సుధాకర్ పనితీరు పట్ల అక్కడి ప్రజలు సంతృప్తిగా లేరని తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ తరుపున బూర్ల రామాంజనేయులు పనిచేస్తున్నారు. మొత్తానికైతే వైసీపీకి అనుకూలంగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో టీడీపీకి లీడింగ్ వస్తుంది.
Discussion about this post