ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీకి కలిసిరాని నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే…అవి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినవే. ముఖ్యంగా అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు ఏజెన్సీ నియోజకవర్గాల్లో టీడీపీకి విజయాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇక గత రెండు ఎన్నికల నుంచి అయితే ఈ ఏజెన్సీ నియోజకవర్గాల్లో సైకిల్ చిత్తు అవుతుంది. వైసీపీ హవా స్పష్టంగా కనబడుతుంది.

అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో పార్వతీపురం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో అయితే అన్నీ స్థానాల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక ఎన్నికలై రెండేళ్ళు గడిచిన నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ మీద వస్తున్న వ్యతిరేకత వల్ల, టీడీపీకి కాస్త ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.కానీ కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి ఇంకా ఘోరంగా ఉంది. పాలకొండ, పాడేరు, కురుపాం, సాలూరు లాంటి స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తుంది. కాకపోతే ఆ వ్యతిరేకతని టీడీపీ నేతలు పెద్దగా ఉపయోగించుకోలేకపోతున్నారు. పైగా కొన్ని స్థానాల్లో టీడీపీ నేతలు పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. దాని వల్ల ఆ ప్రాంతాల్లో టీడీపీ పికప్ అవ్వలేకపోతుంది.

ఇటు అరకు, పార్వతీపురం, రంపచోడవరం నియోజకవర్గాల్లో వైసీపీ ఇంకా బలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా ఈ స్థానాల్లో టీడీపీ నేతలు అంత దూకుడుగా పనిచేస్తున్నట్లు లేరు. అందుకే ఈ నియోజకవర్గాల్లో టీడీపీ వీక్‌గానే ఉందని చెప్పొచ్చు. అయితే వచ్చే ఎన్నికల్లోపు అరకు పార్లమెంట్ పరిధిలో టీడీపీ పికప్ అయితే పర్లేదు. అప్పుడు సగం స్థానాల్లోనైనా గెలవగలుగుతుంది. లేకపోతే అంతే సంగతులు. మరి ఏజెన్సీ నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎక్కడ ఎగురుతుందో చూడాలి.
Discussion about this post