వైసీపీ సర్కార్ రెండేళ్ల పాలన తరువాత ఏపీలో పొలిటికల్ సీన్ బాగా మారుతోంది. అధికార పార్టీ మీద జనాలలో కూడా మోజు మెల్లగా తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీలో కూడా చురుకుదనం పుడుతోంది. ఇంతకాలం కరోనాతో పాటు వైసీపీ వేధింపుల కారణంగా కొంత మౌనాన్ని పాటించిన పార్టీ శ్రేణులు ఇపుడు ముందుకు ఉరుకుతున్నాయి. లోకేష్ జిల్లాల పర్యటనకు మంచి స్పందన లభిస్తోంది. లోకేష్ సైతం తన బాడీ లాంగ్వేజ్ మార్చేశారు. పంచ్ డైలాగులతో అధికార పార్టీకి దడ పుట్టిస్తున్నారు.
లోకేష్ విశాఖ కర్నూల్ జిల్లాల పర్యటనలు హిట్ కావడంతో రానున్న రోజుల్లో చినబాబు ఏపీలోని అన్ని జిల్లాలకు వెళ్తారని అంటున్నారు. ప్రత్యేకించి ఆయన అటెన్షన్ రాయల సీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రా మీద ఉంటుంది అంటున్నారు. ఎటూ గోదావరి, కోస్తా జిల్లాలు ఈసారి పొలిటికల్ గా భారీ మార్పు దిశగా సాగుతాయని అంటున్నారు. దాంతో వైసీపీకి పట్టున్నరాయల సీమ నుంచి నరుక్కు రావాలని లోకేష్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. అదే విధంగా ఉత్తరాంధ్రా ఎపుడూ టీడీపీకి కంచుకోటగానే ఉంది. 2019 ఎన్నికల్లో కొంచెం తేడా కొట్టింది.దాంతో విశాఖ కేంద్రంగా చేసుకుని ఉత్తరాంధ్రాలో టీడీపీని పటిష్టం చేయడానికి లోకేష్ దూకుడుగానే అడుగులు వేస్తున్నారు. విశాఖను టీడీపీ హయాంలో ఆర్ధిక రాజధానిగా చేశారు. అంతే కాదు అప్పట్లో పెట్టుబడుల సదస్సులను ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించి పారిశ్రామికవేత్తలను బాగానే ఆకట్టుకున్నారు. అదే సమయంలో విశాఖను ఉపాధికి కేంద్రంగా నిలపాలని యత్నించారు. ఐటీ పరంగా నాడు గుర్తింపు దక్కింది.
ఇపుడు పేరుకు రాజధాని అంటున్నారు కానీ విశాఖ అన్ని విధాలుగా నష్టపోతోంది. దాంతో విశాఖ వాసులకు గత పాలనకు నేటికీ మధ్య వ్యత్యాసాన్నిజనాలకు గట్టిగా చెప్పడం ద్వారా తిరిగి పసుపు జెండా ఇక్కడ ఎగరేయాలని లోకేష్ భావిస్తున్నారు. మొత్తానికి లోకేష్ తెస్తున్న హుషార్ తో టీడీపీకి కొత్త బలం వస్తోంది. ఇదే ఊపు కొనసాగితే మాత్రం అధికార పార్టీకి ఇబ్బందే అని చెప్పాల్సిందే.
Discussion about this post