పప్పు…ఇదే మొన్నటివరకు వైసీపీ నేతలు నారా లోకేష్‌ని ఉద్దేశించి చేసిన కామెంట్…టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు లోకేష్‌ని వైసీపీ నేతలు అవహేళన చేస్తూనే వచ్చారు. అలాగే 2019 ఎన్నికల్లో ఓడిపోయాక కూడా అదే రీతిలో ఎగతాళి చేసుకుంటూ వచ్చారు. ఇక ఇక్కడ నుంచే మార్పు మొదలైంది…పప్పు అని పిలిచిన నోర్లు ఇప్పుడు….లోకేష్ లీడర్ అయిపోయాడు అనే స్థాయికి లోకేష్ ఎదిగారు.

ఇలా ప్రతిసారి ఎగతాళి చేస్తూ లోకేష్ ఎదుగుదల కోసం కృషి చేసిన వైసీపీ…ఇప్పుడు లోకేష్‌ని అరెస్ట్ చేయించి, మరింతగా ఆయన సత్తా ఏంటో బయటపడేలా చేశారు. తాజాగా హోమ్ మంత్రి సుచరిత సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులో రమ్యశ్రీ అనే దళిత యువతిని ఓ దుర్మార్గుడు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్, ఇతర టీడీపీ నేతలు వెళ్లారు.

అయితే అదే సమయంలో పోలీసులు కావాలని వైసీపీ నేతలకు కూడా రమ్యశ్రీ కుటుంబాన్ని పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు ముస్తఫా, మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిలు తమ అనుచరులని వేసుకుని హడావిడి చేశారు. లోకేష్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. అదే సమయంలో అక్కడున్న టీడీపీ శ్రేణులు సైతం, జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఈ విషయంలో వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు…లోకేష్, ఇతర టీడీపీ నేతలని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పారు. చివరికి సెక్షన్ 151 సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చి లోకేష్‌తో సహ ఇతర టీడీపీ నాయకులని విడుదల చేశారు.

అయితే ఈ ఎపిసోడ్‌లో లోకేష్ పరామర్శించి వెళ్లిపోయేవారు. కానీ అనవసరంగా వైసీపీ శ్రేణులు హడావిడి చేయడం, పోలీసులు సైతం లోకేష్‌ని అరెస్ట్ చేయడంతో పరిస్తితి పూర్తిగా మారిపోయింది. ఈ ఎపిసోడ్‌తో ఊహించని విధంగా లోకేష్‌లో ఉన్న పవర్‌ఫుల్ నాయకత్వం బయటపడింది. అనవసరంగా అరెస్ట్ చేసి లోకేష్ సత్తా ఏంటో బయటపెట్టారు. మొత్తానికైతే లోకేష్ లీడర్‌గా ఎదగడానికి వైసీపీ ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంది.
ReplyForward |
Discussion about this post