కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకులు ఎక్కువగా టీడీపీలోనే ఉంటారనే సంగతి తెలిసిందే. అటు వైసీపీలో రెడ్డి వర్గం నేతల హవా ఎక్కువగా ఉంటుంది. అలా అని వైసీపీలో కమ్మ నాయకులు, టీడీపీలో రెడ్డి నాయకులు లేకుండా లేరు. ఆయా నియోజకవర్గాల్లో ఉండే సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా పార్టీలు నాయకులని బరిలోకి దించుతాయి. అందుకే 2019 ఎన్నికల్లో టీడీపీకి చెక్ పెట్టేందుకు పలు నియోజకవర్గాల్లో వైసీపీ తరుపున కమ్మ నాయకులు బరిలో దిగి విజయం సాధించారు.

గుడివాడలో మంత్రి కొడాలి నానీని పక్కనబెడితే, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడులో నంబురు శంకర్ రావు, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్, దెందులూరులో అబ్బయ్య చౌదరీలు వైసీపీ తరుపున ఎమ్మెల్యేలుగా గెలిచారు. టీడీపీలో ఉన్న కమ్మ నాయకులకు చెక్ పెడుతూ, వీరు వైసీపీ తరుపున విజయం సాధించారు. ఇలా వైసీపీ తరుపున గెలిచిన కమ్మ ఎమ్మెల్యేలు ఈ రెండేళ్లలో మెరుగైన పనితీరు కనబర్చరా? అంటే పెద్దగా లేదనే చెప్పొచ్చు.

ఎమ్మెల్యేలుగా ప్రజలకు మెరుగైన సేవలు చేయడంలో ఈ కమ్మ ఎమ్మెల్యేలు విఫలమైనట్లు తెలుస్తోంది. పైగా వైసీపీలో రెడ్డి వర్గం హవా ఎక్కువగా ఉండటంతో వీరు అనుకున్న విధంగా పనులు జరగడం లేదని అర్ధమవుతుంది. పైగా కొందరు ఎమ్మెల్యేలపై పలు ఆరోపణలు వస్తున్నాయి.ఇసుక, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు, అక్రమ మైనింగ్, భూ కబ్జాలు లాంటి ఆరోపణలు కమ్మ వైసీపీ ఎమ్మెల్యేలపై వస్తున్నాయి.

అలాగే ఈ కమ్మ ఎమ్మెల్యేలు ప్రజలకు పనులు చేసి పెట్టడం కంటే, సొంత పనులని చక్కదిద్దుకోవడంలోనే ముందు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కమ్మ ఎమ్మెల్యేలకు మైనస్ ఎక్కువగా వస్తుంది. అదే సమయంలో వీరు ప్రత్యర్ధులుగా ఉన్న టీడీపీ నాయకులు పుంజుకోవడంతో, వచ్చే ఎన్నికల్లో ఈ వైసీపీ కమ్మ ఎమ్మెల్యేలకు బొమ్మ కనిపించడం ఖాయమని తెలుస్తోంది.


Discussion about this post