నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ కుటుంబం మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుటుంబంలో రాజకీ య కలకలం రేగిందని పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. మూడు దశాబ్దాలకు పైగా మేకపాటి ఫ్యామిలీ నెల్లూ రులో ఎలాంటి విమర్శలు లేకుండా.. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ముందుకు సాగుతున్న విష యం తెలిసిందే. మేకపాటి రాజమోహన్‌రెడ్డి.. ఆయన సోదరుడు చంద్రశేఖరరెడ్డి, మేకపాటి తనయుడు.. గౌతం రెడ్డిలు.. నెల్లూరులోని మూడు నియోజకవర్గాల్లో.. చక్రం తిప్పారు. ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు పార్లమెంటు స్థానంలోనూ మేకపాటి కుటుంబానికి మంచి పేరుంది.

ముఖ్యంగా అందరినీ కలుపుకొని పోతారని.. అవినీతి రహితంగా వ్యవహరిస్తారని.. ఏ సమస్య వచ్చినా.. పరిష్కరిస్తారని కూడా ఈ కుటుంబానికి పేరుంది. అయితే.. అనూహ్యంగా.. ఇప్పుడు.. ఈ కుటుంబంపై అవినీతి మరకలు అంటుకున్నాయి. అంతేకాదు.. పార్టీ కేడర్‌లోనూ నిస్సత్తువ ఆవహించింది. మరి ఇంతకీ ఏం జరిగింది? మేకపాటి ఫ్యామిలీ ఎందుకు చర్చగా మారింది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. విషయంలోకి వెళ్తే.. గత ఎన్నికలకు ముందు వరకు మేకపాటి రాజమోహన్‌రెడ్డి యాక్టివ్‌గా ఉన్నారు. దీంతో ఆయన సోదరుడు, తనయుడు కూడా ఆయన కనుసన్నల్లోనే రాజకీయాలు చేశారు.

అయితేగత ఎన్నికలకు ముందు నుంచి ఆయన అనారోగ్య కారణంగా.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటును కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, ఆత్మకూరు నుంచి గౌతం రెడ్డి విజయం దక్కించుకోగా.. ఉదయగిరి నుంచి వరుసగా చంద్రశేఖరెడ్డి గెలుపు గుర్రం ఎక్కారు. ఏడాది కిందటి వరకు బాగానే ఉన్నప్పటికీ.. చంద్రశేఖరరెడ్డిపై అవినీతి మరకలు అంటున్నాయి. ఇసుక, జగనన్న ఇళ్లు.. మట్టి తవ్వకాలు .. వంటి విషయాల్లో ఆయన అవినీతికి పాల్పడుతున్నారని.. ప్రతి పనికీ రేటు నిర్ణయించారని.. టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

నిజానికి ఇన్నేళ్ల రాజకీయంలో మేకపాటి కుటుంబంపై ఈ తరహా విమర్శలు గతంలో ఎప్పుడూ రాలేదు. రాజకీయ ప్రత్యర్థులు చాలా మంది ఉన్నప్పటికీ.. రాజకీయంగా విమర్శలు చేసుకున్నారే తప్ప.. ఎప్పుడూ .. అవినీతి అంటూ..కామెంట్లు చేయలేదు. ఇక, గౌతం రెడ్డి విషయంలో పార్టీ కేడర్ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎవరినీ ఆయన పట్టించుకోవడం లేదు. ఎవరు ఏ సమస్యతో వెళ్లినా.. సార్ హైదరాబాద్‌లో ఉన్నారు! అనే సమాధానమే వసస్తోంది. దీంతో మేకపాటి కుటుంబానికి ఇప్పుడు ఏమైంది? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.

Discussion about this post