ప్రతివత పరమాన్నం వండితే తెల్లారే దాకా చల్లార్లేదట.. ఇప్పుడు విశాఖ భూ కబ్జాల విషయంలో వైసీపీ నేతల వైఖరి కూడా అలాగే ఉంది. తాము నీతిమంతులమని, నిప్పులాంటి వాళ్ళమని వైసీపీ నేతలు లోలోపల ఫీల్ అవుతూ, టీడీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని, వారి అక్రమాలని ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తామని విశాఖకు సీఎం మాదిరిగా వ్యవహరిస్తున్న విజయసాయి రెడ్డి చెబుతున్నారు.అసలు విశాఖలో టీడీపీ బలంగా ఉందని, అక్కడ నాయకులు వైసీపీకి ధీటుగా పనిచేస్తున్నారని చెప్పి, వారిని ఎప్పటినుంచో దెబ్బకొట్టాలని విజయసాయిరెడ్డి చూస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడుతున్నారనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఇక ఇక్కడ విజయసాయి, వైసీపీ నేతలు చేసే డబుల్ యాక్షన్ ఏంటంటే…రాజధాని పేరుతో విజయసాయి అండ్ కొ విశాఖలో ఎలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారో అందరికీ తెలుసని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
విశాఖలో భూ దందాలు, భూ సమీకరణలో మోసాలు జరుగుతున్నాయని, విజయసాయిరెడ్డి బినామీగా ఆయన అల్లుడికి సన్నిహితుడుగా ఉన్న ప్రతాప్‌రెడ్డి ఉన్నారని, భీమిలి పరిసరాల్లో రూ. 320 కోట్ల విదేశీ పెట్టుబడులతో 650 ఎకరాలు కొన్నారన్నారని చెబుతున్నారు. అలాగే అరబిందో ఫార్మాకు చెందిన గొలుసుకట్టు సంస్థలు విజయసాయిరెడ్డికి బినామీగా వ్యవహరిస్తున్నాయని, వైసీపీ నాయకులు తగరపువలస జూట్ మిల్లు భూములను కబ్జా చేశారని గతంలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ తేల్చింది.ఇలా పెద్ద ఎత్తున విశాఖలో విజయసాయి అండ్ బ్యాచ్ భూములని కబ్జా చేశారని, అనేక అక్రమాలని చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతోనే విజయసాయి డబుల్ యాక్షన్ చేయడం మొదలు పెట్టారని తెలుస్తోంది. తమపై ఆరోపణలని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ నేతలపై రివర్స్ ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. టీడీపీ నేతలు గతంలో భూ కబ్జాలు చేశారని, ఇప్పుడు అక్రమాలని వెలుగులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. అలాగే విశాఖ టీడీపీకి కీలకంగా ఉన్న పల్లా శ్రీనివాస్ టార్గెట్‌గా విజయసాయి రాజకీయం చేస్తున్నారు. అలాగే ఆయన ఆస్తులని అక్రమ కట్టడాల పేరిట కూల్చేస్తున్నారు.
పల్లా వైసీపీలోకి రావట్లేదని చెప్పి ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక పల్లా కోర్టు ద్వారా స్టే తెచ్చుకుని విజయసాయి దాడులకు చెక్ పెడుతున్నారు. అంటే వైసీపీ నేతలే దొంగతనం చేసే ఎదుట వాళ్ళని దొంగ దొంగ అని ఆరోపిస్తున్నారు. ఇక దీనికి బ్లూ మీడియా వంత పాడుతూ, అబ్బో వైసీపీ ప్రభుత్వం గొప్ప పనిచేస్తుందని డప్పు కొట్టే పనిచేస్తుంది. మొత్తానికైతే విశాఖలో వైసీపీ నేతలు డబుల్ యాక్షన్ చేస్తుంటే, టీడీపీ నేతలు అదిరిపోయే రియాక్షన్‌తో చెక్ పెడుతున్నారు.
Discussion about this post