ఏపీలో జగన్ ప్రభుత్వానికి చుక్కలు కనబటడం మొదలైనట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ నేతల్లో ఎక్కడా లేని ఆందోళన కూడా మొదలైంది. ఒక్క ఛాన్స్ అంటూ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్..రెండేళ్లలోనే ప్రజల అంచనాలని అందుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది. తన అప్పుల పాలనతో ప్రజల నెత్తి మీద పిడుగులు వేస్తూ ముందుకెళుతున్న జగన్‌కు ప్రజలు కూడా గట్టిగా షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది.

అలాగే ఇసుక, మద్యపానం, ఉద్యోగులుకు సమయానికి జీతాలు ఇవ్వకపోవడం, పన్నుల భారం పెంచి ప్రజల నడ్డి విరవడం, వైసీపీ నాయకుల ఒంటెద్దు పోకడ, అవినీతి, అక్రమాలు, టీడీపీ నేతలపై కక్ష సాధించడం….అబ్బో ఒకటి ఏంటి..చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా వైసీపీ ప్రభుత్వం దారుణమైన మైనస్‌ని తెచ్చుకుంది. అందుకే ఇటీవల వస్తున్న సర్వేల్లో వైసీపీకి అనుకూల ఫలితాలు రావడం లేదు. ఇటీవల ఆత్మసాక్షి గ్రూప్ పేరుతో వచ్చిన సర్వేలో గతంలో కంటే వైసీపీకి ఇప్పుడు సీట్లు తగ్గనున్నాయని తేల్చేసింది. అలాగే టీడీపీకి సీట్లు పెరుగుతాయని చెప్పింది.అంతెందుకు ప్రతి ఏటా నేషనల్ మీడియా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట వచ్చిన సర్వేలో, సీఎం జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని తెలిసింది. అసలు జగన్ టాప్ టెన్‌లో కూడా లేకుండా పోయారు. గత ఏడాది టాప్ 3లో ఉన్న జగన్ ఇప్పుడు టాప్ 10లో లేరు. అలాగే ఆయనపై 81 శాతం వ్యతిరేకత వచ్చిందని తేలింది.

అయితే తాజాగా ఓ ఫేమస్ యాప్ సర్వేలో జగన్ అధికారం కోల్పోవడం ఖాయమని తేలింది. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునే పార్టీ ఏది అనే ప్రశ్నకు….44 శాతం ప్రజలు టీడీపీకి మద్ధతు ఇవ్వగా, 43 శాతం వైసీపీకి ఇచ్చారని లోకల్ సర్వే తేల్చి చెప్పింది. అలాగే జనసేన-బీజేపీ అధికారంలోకి వస్తుందని 13.5 శాతం మంది చెప్పారు. అంటే ఈ సర్వే బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే…మళ్ళీ చంద్రబాబు సీఎం కానున్నారని అర్ధమవుతుంది.
Discussion about this post