తాము చేసిన తప్పుని కూడా ఎదుటవాళ్ళపై తోసేసి రాజకీయం చేసే మీడియా ఏది ఉందంటే…అది బ్లూ మీడియానే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్లూ మీడియా అంటే అధికార వైసీపీకి, జగన్‌కు భజన చేసే సంస్థలు అని అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా మనసాక్షి లేకుండా ఓ సంస్థ అబద్దాలని సైతం నిజం చేయాలని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే సంస్థ ఓ దుర్మార్గుడు చేతిలో హత్య గావించబడ్డ రమ్యశ్రీ కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్ళిన నారా లోకేష్‌పై బురదజల్లే కార్యక్రమం చేస్తుంది.

తాజాగా రమ్యశ్రీ కుటుంబాన్ని నారా లోకేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. అయితే అదే సమయంలో అక్కడకు వైసీపీ నేతలు, కార్యకర్తలు వచ్చి పెద్ద ఎత్తున హడావిడి చేశారు. అలాగే లోకేష్‌పై దూషణలు చేశారు. అటు గుంటూరు హాస్పిటల్‌లో ఉన్న రమ్యశ్రీ మృతదేహాన్ని లోకేష్ వస్తున్నారని చెప్పి పోలీసులు, వైసీపీ నేతలు కావాలని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ టీడీపీ నాయకులు కాసేపు ప్రతిఘటించారు. పోలీసులు, వైసీపీ శ్రేణులు…టీడీపీ నాయకులపై విరుచుకుపడ్డారు.అయితే రమ్యశ్రీ ఇంటి దగ్గర కూడా గొడవ చేసిన వైసీపీ వాళ్ళని వదిలేసి పోలీసులు లోకేష్, టీడీపీ నాయకులని అరెస్ట్ చేశారు. ఇక దీనిపై అసాక్షి….లోకేష్, టీడీపీ నాయకులు గొడవ చేశారని, పోలీసులు, వైసీపీ నాయకులపై దాడి చేయడానికి చూశారని, అందుకే పోలీసులు లోకేష్, టీడీపీ నాయకులని అరెస్ట్ చేశారని చెప్పింది. అలాగే లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని కథనాలు వేసింది.

ఇక బ్లూ మీడియాకు తమ్ముళ్ళు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. శవ రాజకీయాలు అనగానే…ఏపీలో మొదట గుర్తొచ్చే పేరు సీఎం జగన్‌దే అని, వైఎస్సార్ చనిపోయాక జగన్, శవ రాజకీయం ఎలా చేశారో అందరికీ తెలుసని గుర్తు చేస్తున్నారు. ఓ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన లోకేష్‌ని వైసీపీ నేతలే అడ్డుకుని, రివర్స్‌లో ఆయనపై కేసు పెడితే ఈ బ్లూ మీడియా గురివింద కబర్లు చెబుతూ, లోకేష్ మీద విషం చిమ్ముతుందని ఫైర్ అవుతున్నారు.
Discussion about this post