రాజకీయాల్లో యువతదే కీలక పాత్ర అని చెప్పొచ్చు. వారే భవిష్యత్ నాయకులు. అందుకే రాజకీయ పార్టీలు సైతం యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి చూస్తూ ఉంటాయి. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి కృషి చేస్తాయి. ఇక ఈ బాటలోనే ప్రతిపక్ష తెలుగుదేశం కూడా వెళుతుందని చెప్పొచ్చు. నలభై ఏళ్ల చరిత్ర గల టిడిపిలో సీనియర్ నాయకులు పెరిగిపోయారు. పార్టీలో యువ నాయకులు తక్కువ అయిపోయారు.

కానీ భవిష్యత్‌లో టిడిపిని నడిపించాల్సిన నారా లోకేష్…యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకెళుతున్నారు. ఇప్పటినుంచే తన టీంని రెడీ చేసుకుంటున్నారు. అందుకే పార్టీలో యువ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దగా బ్యాగ్రౌండ్ లేని శ్రీరామ్ చినబాబు, ప్రణవ్ గోపాల్‌లకు కీలక బాధ్యతలు అప్పగించారు. టిడిపిలో యువ నేతలకు మంచి వేదికలుగా తెలుగు యువత, టిఎన్‌ఎస్‌ఎఫ్‌లు ఉన్నాయని చెప్పొచ్చు.ఈ రెండే టిడిపికి ప్రధాన బలం అని చెప్పొచ్చు. గతంలో చాలామంది నాయకులు ఈ పదవులు చేపట్టి కీలక నాయకులుగా ఎదిగారు. అయితే తెలుగు యువత అధ్యక్షుడుగా శ్రీరామ్‌ని, టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడుగా ప్రణవ్‌లని నియమించినప్పుడు టిడిపి క్యాడర్ అంతా షాక్ తిన్నది. అసలు వీరు ఎవరు? పార్టీలో ఈ నాయకుల పేర్లు ఎప్పుడు వినలేదని చర్చించుకున్నారు. అసలు ఎలాంటి క్రేజ్ నాయకులకు పదవులు ఇవ్వడం ఏంటని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపించాయి.

కానీ అలాంటి చర్చలకు శ్రీరామ్, ప్రణవ్‌లు ఇద్దరు చెక్ పెట్టినట్లే కనిపిస్తోంది. ఈ ఇద్దరు నేతలు తమ బాధ్యతలని సక్రమంగానే నిర్వర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. నిరుద్యోగ యువతకు అండగా ఉండటంలో గానీ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడంలో గానీ ఇద్దరు నాయకులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పోలీసుల అరెస్టులకు సైతం బెదరకుండా పనిచేస్తున్నారు. అలాగే వైసీపీ నాయకులకు ధీటుగా కౌంటర్లు ఇవ్వడంలో కూడా ముందున్నారు. మొత్తానికైతే శ్రీరామ్-ప్రణవ్‌ల జోడీ టిడిపికి ప్లస్ అవుతున్నారనే చెప్పొచ్చు.
Discussion about this post