రాజకీయాల్లో ఇప్పుడు నేతలను నడిపించేది.. సొంత వ్యూహాలు కావు.. వారు నియమించుకున్న వ్యూహకర్తలే ! . ఈ విషయం మనకు 2014 నుంచి కనిపిస్తూనే ఉంది. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీని ప్రధానిని చేసేందుకు బీజేపీ ఒక వ్యూహకర్తను తెరమీదికి తెచ్చింది. ఈయనే ప్రశాంత్ కిశోర్. ఉన్నత విద్యావంతుడు.. బహుభాషా పరిజ్ఞానం.. ప్రజల నాడి తెలిసినవ్యక్తిగా ఆయనకు పేరుంది. ఈ క్రమంలోనే మోడీని ఆయన తన వ్యూహాలతో నడిపించి.. ప్రధాని పీఠం ఎక్కించారనే విషయం అందరికీ తెలిసిందే.
ఇక, ఆ తర్వాత.. ఏపీలో వైసీపీ అధినేత జగన్‌నుముఖ్యమంత్రి చేసేందుకు ఇక్కడ బాధ్యతలు తీసుకున్న పీకే.. తన టీంతో.. ఇక్కడా సక్సెస్ అయ్యారు. అయితే.. ఈయన టీం నుంచి బయటకు వచ్చిన ప్రియ, రాబిన్ శర్మ వంటివారు కూడా వ్యూహకర్తలు చలామణి అవుతున్నారు. నిజానికి తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానని చెప్పిన షర్మిల.. తనకు రాజకీయ వ్యూహకర్తగా పీకేనే తొలుత భావించారు. అయితే.. అటు తన సొంత అన్నకు ఇప్పటికీ వ్యూహకర్తగానే ఉన్న పీకే అయితే.. బాగుండదనే ఉద్దేశంతో.. ఆయన టీం నుంచి వచ్చిన ప్రియను వ్యూహకర్తగా నియమించుకున్నారు.
అయితే.. ప్రియ వ్యవహారం చూస్తే.. ఆమె తన సొంత కంపెనీలతో వ్యాపారంలో బిజీగా ఉంటూనే షర్మిల పార్టీకి వ్యూహకర్తగా ఉండడం చూస్తే.. అనేక అనుమానాలకు అవకాశం ఇచ్చినట్టయింది. తమిళనాడుకు చెందిన ప్రియ సౌందర రాజన్.. అనే ఈమె.. తమిళనాడులోని సొంత విద్యాసంస్థలు ఇందిరా ఇనిస్ట్యూట్‌లో ఒక బోర్డు డైరెక్టర్. అదేసమయంలో ఆమె అమెరికాలో కాస్మొటిక్ కోర్సును చేసిన తర్వాత.. ఈ వ్యాపారం కూడా చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అటు వ్యాపారాలు, ఇటు రాజకీయాలు అంటే.. సహజంగానే అనుమానం వస్తుంది. సో.. దీనిని బట్టి.. పైకి ప్రియను పెట్టుకున్నా… అంతర్గతంగా షర్మిల పార్టీకి పీకేనే పనిచేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిలో నిజానిజాలు తెలియాలంటే.. కొంత వెయిట్ చేయాల్సిందే.
Discussion about this post