ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. వంశపారంపర్యంగా ట్రస్ట్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న అశోక్ గజపతి రాజుని తొలగించి, వైసీపీ పభుత్వం సంచయితని నియమించడం కూడా విషయం కూడా తెలిసిందే. ఇక సంచయిత ఎక్కడ నుంచి వచ్చారో కూడా చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత కోర్టులో అశోక్ విజయం సాధించి, మళ్ళీ ట్రస్ట్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక ఎలాంటి వ్యవహారం నడుస్తుందో రాష్ట్రం మొత్తం చూస్తుంది.
ఇక తాజాగా మాన్సాస్ ఉద్యోగులు తమ జీతాలు ఇవ్వాలని ట్రస్ట్ ఈవోని ముట్టడించారు. అశోక్ ఛైర్మన్ అయినా సరే ఈవో, వైసీపీ చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆయనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వొద్దని బ్యాంకుకు లేఖ రాయడంతోనే సమస్య మొదలైందని చెబుతున్నారు. అయితే ఉద్యోగులు, ఈవోని ముట్టడించడంపై సంచయిత స్పందిస్తూ, అశోక్ గజపతి రాజే ఉద్యోగులని రెచ్చగొట్టి పంపించారని, మాన్సాస్‌లో రాజకీయం చేయొద్దని సంచయిత కోరారు.అయితే సంచయిత మాట్లాడిన నీతి వాక్యాలకు కౌంటర్లు కూడా గట్టిగానే వస్తున్నాయి. అశోక్ గజపతి ఎప్పుడు ఒకరిని రెచ్చగొట్టి, మరొకరి మీదకు ఉసిగోల్పే ప్రయత్నం చేయలేదని గజపతి ఫ్యామిలీ అనుచరులు చెబుతున్నారు. గత ఏడాదిన్నరగా జీతాలు ఇవ్వలేదని, ఆ కాలంలో ఛైర్మన్‌గా సంచయిత ఉన్నారని, ఇక మాన్సాస్‌లో ఎప్పుడూలేని విధంగా రాజకీయం చేసింది, వైసీపీ అని, ఆ విషయం ప్రజలందరికీ తెలుసని చెబుతున్నారు.
అశోక్ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నా కూడా ఈవో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసని, ఆయనే జీతాలు ఆపేశారని ఉద్యోగులు ఆందోళన చేశారని, అన్నీ తెలిసి కూడా నీతి వాక్యాలు చెప్పడం సంచయితకే చెల్లిందని అంటున్నారు. ఈ నీతి వాక్యాలు ప్రజలు నమ్మరని మాట్లాడుతున్నారు.
Discussion about this post