జగన్ ఏలుబడిలో ఏసీబీ జేసీబీ కామన్ అని టీడీపీ నాయకులు అంటారు. అది నిజం కూడా. జగన్ సీఎం అయి నెల కూడా తిరగకుండానే అమరావతి వద్ద ఉన్న ప్రజా వేదికను కూలగొట్టేశారు. నాడు గేరు మార్చిన జేసీబీ ఇప్పటికీ స్పీడ్ తగ్గకుండా ప్రత్యర్ధుల మీదకే దూసుకువస్తూనే ఉంది. విశాఖలో గత ఏడాదిగా జేసీబీని టీడీపీ నేతల ఇళ్ల మీదకు, వారి నిర్మాణాల మీదకు పంపిస్తున్న వైసీపీ సర్కార్ అదంతా ధర్మమేనని గట్టి మాటలు చెబుతోంది.
విశాఖలో భూకబ్జాలు టీడీపీ నేతలు చేశారు కాబట్ట వారి భూముల్లోకి జేసీబీని పంపుతున్నామని అంటోంది. దీని మీద తటస్థ పార్టీలు అయితే గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయి. వ విశాఖ ప్రభుత్వ భూములను చెర పట్టిన వారిలో అత్యధికులు వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపిస్తున్నారు. మరి వారి భూముల్లోకి అక్రమ కట్టడాల మీదకు సర్కార్ వారి జేసీబీఎ ఎందుకు వెళ్లదని ప్రశ్నిస్తున్నారు.
విశాఖ రాజధాని అని ప్రకటించాక భూకబ్జాలు ఎక్కువగా అధికార పార్టీ నేతలవే ఉన్నాయని కూడా గుర్తు చేస్తున్నారు. చూడబోతే ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యగానే ఉంది తప్ప మరేమీ కాదని సీపీఎం నేతలు అంటున్నారు. విశాఖలో వైసీపీ నేతలు చాలా చోట్ల ఆక్రమణలు చేశారని కూడా అంటున్నారు. విశాఖలో సింహాచలం భూములతో పాటు విలువైన ఎన్నో భూములు చాలా మంది పెద్దల చేతిలో ఉన్నాయని అంటున్నారు.
మరి వారి మీదకు జేసీబీ తోలకుండా టీడీపీ నేతలను తప్పుగా చిత్రీకరించి జనంలో పలుచన చేయాలని చూస్తే ఆటలు సాగవని అంటున్నారు. పైగా వైసీపీ పెద్దలు అతి ఉత్సాహంతో జేసీబీని వదులుతూ బదనాం చేయాలని చూసిన ధర్మం గెలుస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు మొత్తానికి విశాఖ భూ దందా పేరిట సాగుతున్న రాజకీయ కధ వెనక వైసీపీ పెద్దల కక్ష సాధింపు చర్యలే ఉన్నాయని అంటున్నారు.
Discussion about this post