సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారయణ.. గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులను విచారించినప్పటి నుంచి ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇమేజ్ పెరిగింది. తెలుగు వారే అయినప్పటికీ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అదికారికావడంతో కేవలం జగన్ కేసులతోనే ఆయనకు రాజకీయంగా.. మీడియా ముఖంగా కూడా గుర్తింపు వచ్చింది. గత 2019 ఎన్నికలకు ముందు ఐపీఎస్‌ను వదులుకుని.. రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీలో చేరి.. విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన అందరికీ భిన్నంగా తాను గెలిస్తే.. ఇది చేస్తా.. అది చేస్తా.. అని మాటల రూపంలోనే కాకుండా.. వందరూపాయల స్టాపు పేపర్‌పై ప్రజలు లిఖిత పూర్వక వాగ్దానాలు కూడా చేశారు.

అయితే.. ఆ ఎన్నికల్లో వీవీ ఓడిపోయారు. అయినప్పటికీ.. ప్రజల సమస్యల విషయంంలో ఆయన అప్రమత్తంగానే ఉంటున్నా రు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత.. రెండోరోజే ఆయన నియోజకవర్గంలో పర్యటించి.. ప్రజలను కలుసుకున్నారు. ఇక, పార్టీలో ఆయనకు ఏర్పడిన అసంతృప్తి కారణంగా.. జనసేనకు దూరమయ్యారు. ఆ తర్వాత.. కరోనా నేపథ్యంలో కొన్ని నెలల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అయినప్పటికీ.. ప్రజల సమస్యలపై ఆయన ఆరాతీస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడాన్ని ప్రశ్నించారు. అందరిలాగా ఆయన కేవలం రోడ్డెక్కి జెండా పట్టుకునినినాదాలు.. కామెంట్లు చేయకుండా.. న్యాయపోరాటానికి దిగారు.

ఈ క్రమంలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కేంద్రానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే మూడు సార్లు విచారణ జరగ్గా.. ప్రతిసారీ.. కౌంటర్ విషయంలో జాప్యం చేస్తూ.. వచ్చి న కేంద్రం.. తాజాగా అపిడవిట్ దాఖలు చేసింది. దీనిలో తాను చెప్పాలనుకున్నది చెబుతూనే.. లక్ష్మీనారాయణపై బండవేసింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని.. అమ్మేసే తీరుతామని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయం విధానపరమైన నిర్ణయమని.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుందని.. సో.. ఈ విషయంలో మీరు(కోర్టు) జోక్యం చేసుకోవడం తగదని వాదించింది.

ఇంత వరకుబాగానేఉంది. సాధారణంగా.. ఏడాదికాలంగా.. కేంద్రం పాడిందే పాటగా.. విశాఖ ఉక్కను అమ్మేస్తామని చెబుతున్న ట్టుగానే కోర్టుకు కూడా ఇదే విషయం చెప్పిందని అనుకుందాం. కానీ.. ఈ క్రమంలోనే లక్ష్మీనారాయణపై రాజకీయ విమర్శలు చేసింది. అవి కూడా కోర్టుకే సమర్పించడం ఇప్పుడు సంచలనంగా మారింది. “విశాఖ ఉక్కుపై పిటిషన్ వేసిన.. లక్ష్మీనారాయణ ఒక రాజకీయ నాయకుడు. ఆయన గత ఎన్నికల్లో విశాఖ పట్నం ఎంపీగా పోటీ చేసి.. ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో అక్కడి ప్రజలను రాజకీయంగా తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కుపై రాజకీయం చేస్తున్నారు. దీనిని దృస్టిలో పెట్టుకునే కోర్టులో పిటిషన్ వేశారు. సో.. దీనిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పక్కా నాయకుడు కావడంతోనే ఇది దాఖలైంది“ అని కేంద్రం కోర్టుకు వివరించింది. మరి దీనిపై లక్ష్మీనారాయణ ఏం చేయనున్నారో.. చూడాలి.
Discussion about this post