గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే బయటపడుతుంది. అధికార వైసీపీకి ధీటుగా టీడీపీ నేతలు బయటకొచ్చి పోరాటాలు చేయడం మొదలుపెట్టారు. అటు యువ నేత నారా లోకేష్ సైతం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. ప్రజలకు అండగా ఉండటంలో ముందుంటూ..అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నారు. అటు అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది. ప్రస్తుతం వస్తున్న సర్వేల్లో వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలుస్తోంది.

ఇక జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తూ పాలన నడిపిస్తూ, ప్రజల నెత్తి మీద పన్నుల భారం వేయడం….అలాగే అనేక అంశాల్లో జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలు ఆర్ధికంగా నష్టపోతున్నారు. అటు వైసీపీ నేతల అక్రమాలు కూడా ఎక్కువయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ పడిపోతుండగా,టీడీపీ గ్రాఫ్ నిదానంగా పెరుగుతుంది. ఇలాగే టీడీపీ కష్టపడుతూ వెళితే, నెక్స్ట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కానీ ఇలాంటి సమయంలో సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరీ వ్యవహారం పార్టీకి కాస్త ఇబ్బంది వస్తుందనే చెప్పొచ్చు. పార్టీలో సీనియర్లకు గౌరవం లేదని, అసలైన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని, న్యాయం చేయాలని అడిగిన చంద్రబాబు, నారా లోకేష్‌లు స్పందించడం లేదని, అందుకే తాను పార్టీ నుంచి తప్పుకుంటానని బుచ్చయ్య మాట్లాడుతున్నారు. అయితే బుచ్చయ్య మాటలు టీడీపీకి కాస్త ఇబ్బందికరంగానే మారాయని చెప్పొచ్చు.

కాకపోతే బుచ్చయ్య కూడా పార్టీ బాగు కోసమే మాట్లాడుతున్నారని అర్ధమవుతుంది. కానీ ఇలాంటి విషయాలు ఉంటే అంతర్గతంగా సమస్యలని పరిష్కరించుకుంటే బాగుంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే అధిష్టానం కూడా బుచ్చయ్య మాటలని పరిగణలోకి తీసుకుని, పనిచేయాలని…బుచ్చయ్య లాంటి సీనియర్ నాయకులు అవసరం పార్టీకి ఉందని, అందుకే ఈ సమస్యకు ఎంత త్వరగా చెక్ పెడితే,…అంతగా పార్టీకి మంచిదని అంటున్నారు. లేదంటే పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు.
Discussion about this post