సీనియర్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయన కప్‌బోర్డులు, ల్యాప్ టాప్, ఆయన ఇంట్లో పలు డీవీడీలు ఇలా ఏవి చూసినా కూడా అశ్లీల చిత్రాలకు సంబంధించినవే ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంలో శిల్పా శెట్టికి కూడా సంబంధం ఉందని.. ఆమెను త్వరలోనే అరెస్టు చేస్తారని కూడా అంటున్నారు. అయితే రాజ్ కుంద్రా భార్య శిల్పా తో పాటు అతడి తరపున వాదిస్తోన్న లాయర్లు మాత్రం ఆయన అశ్లీల చిత్రాలు తీయలేదని.. అవి కేవలం ఎరోటికా చిత్రాలు మాత్రమే అని వాదిస్తున్నారు.
ఎరోటికా చిత్రాలకు , అశ్లీల చిత్రాలకు చాలా తేడా ఉందని… రాజ్ కుంద్రా చాలా అమాయకుడు అని చెపుతున్నారు. మరో వైపు రాజ్ కుంద్రా ఒకప్పుడు నేపాల్‌లో శాలువాలు అమ్ముకునే వాడు.. అతడు ఇంత తక్కువ టైంలో ఇన్ని కోట్లకు పడగ లెత్తడంతో పాటు స్టార్ హీరోయిన్ గా ఉన్న శిల్పానే పడేయడం వెనక ఈ అశ్లీల చిత్రాల రాకెట్ ద్వారానే సంపాదించిన సంపాదనే కారణం అని అంటున్నారు. ఇక రాజ్ కుంద్రా లాయర్లు మాత్రం అతడు కేవలం లైంగికోద్రేకాన్ని రగిలించే చిత్రాలు మాత్రమే తీశాడని.. వాటిని అశ్లీల చిత్రాలుగా చూడకూడదని చెపుతున్నారు.ఇక హాట్ సాట్ యాప్ నిర్వహణ అంతా లండన్‌లో ఉండే రాజ్ కుంద్రా బావమరిది ప్రదీప్ భక్సిదేనని శిల్పాశెట్టి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఇక ఈ అశ్లీల కంటెంట్ ప్రొడక్షన్‌లో తాను పాల్గొనలేదని.. ఆ మెటీరీయల్ తయారు చేసినప్పుడు కూడా తాను లేనని ఆమె చెప్పిందట. ఇదిలా ఉంటే మరో షాకింగ్ న్యూస్ కూడా బయటకు వచ్చింది. రాజ్ కుంద్రా తన సొంత మరదలు శిల్పాశెట్టి చెల్లెలు షమితా షెట్టితో కూడా ఓ సినిమా రూపొందించాలని అనుకున్నాడట.
అయితే ఆమెతో తీసేది ఏ తరహా సినిమా అన్నది మాత్రం క్లారిటీ లేదు. అయితే నెటిజన్లు మాత్రం రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలు సొంత మరదలితో కూడా తీస్తారా ? అని ప్రశ్నిస్తున్నారు. ఇక రాజ్ కుంద్రా గురించి ఇంకెన్ని లీలలు బయటకు వస్తాయో ? చూడాలి.
Discussion about this post