టీడీపీ నేతల్లో ఆయన స్టయిలే వేరు. ఆయన ఏం మాట్లాడినా.. మీడియాలో ప్రముఖంగా రావాల్సిందే. ఆయన నోరు విప్పితే.. వైసీపీ నేతలకు వాయిస్ ఉండదు. ఆయనే.. టీడీపీ యువ నాయకుడు, బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు. 2014 ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన ఆయన పార్టీలో అనతికాలంలోనే గుర్తింపు పొందారు. అంతేకాదు.. అసెంబ్లీలోనూ తన ప్రత్యేక గళంతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలపై ఆయన చేసిన పదునైన విమర్శలు.. సభను రక్తికట్టించాయి.
మంత్రి పదవికి అన్ని అర్హతలూ ఉండి.. తృటిలో తప్పిపోయినా.. ఉమా పార్టీ తరఫు వాయిస్ వినిపించారు. ఇక, గత 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా పోటీ చేసిన బొండా.. వైసీపీ సునామీని కూడా తట్టుకుని బలమైన పోటీ ఇచ్చారు. ఈ క్రమంలో కేవలం 25 ఓట్ల తేడాతో ఆయన గెలుపునకు దూరం కావాల్సి వచ్చింది. అయినప్పటికీ.. తాను నియోజకవర్గాన్ని అటిపెట్టుకునే ఉంటున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు కూడా ఆయన అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు.
పార్టీ తరఫున ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా.. ఆయన ఫస్ట్ ఉంటున్నారు. వైసీపీ సర్కారును ఇరుకున పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి అనేపేరు తెచ్చుకున్నారు. ఇక, బొండా సతీమని సుజాత కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఇటీవల జరిగిన.. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశారు. పేదలకు అండగా ఉండడంలోను.. సామాజిక కార్యక్రమాలు నిర్వహించడంలోను.. బొండా కుటుంబం రాజకీయాల్లో ఆదర్శంగా ఉంటున్నారనడంలో సందేహం లేదు.
ఇక, ప్రస్తుతం తాను నియోజకవర్గంలో ఓడిపోయినా.. బొండా ఉమా మాత్రం.. గతంలో తాను చేపట్టి.. ఎన్నికలు రాగానే నిలిచిపోయిన కొన్ని కార్యక్రమాలను ఇప్పటికీ పర్యవేక్షిస్తున్నారు. ఉమా .. తన హయాంలో నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేశారు. ప్రతి నాలుగు రోడ్ల కూడలికి ఒక పార్కును ఏర్పాటు చేయడంతోపాటు.. మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు. ఇక, ఇంటింటికీ వంట గ్యాస్ పంపిణీ చేసే పథకానికి కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఇలా.. తనదైన శైలిలో దూసుకుపోయారు. ఇక, ఇప్పుడు గత ఎన్నికల్లో ఓడిపోయినా.. బొండా ఉమాకు ఉన్న ఎ డ్జ్ ఏమాత్రం తరిగిపోలేదని బెజవాడ రాజకీయాల్లో తరచూ వినిపించే మాట ?
Discussion about this post