మాజీ మంత్రి కేఎస్ జవహర్…తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నిత్యం కష్టపడుతున్న నాయకుడు. గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయాక పలువురు నేతలు సైలెంట్ అయిపోతే, మరికొందరు పార్టీలు మారిపోయారు. కానీ ఎలాంటి పరిస్తితి ఉన్నా సరే అధినేత చంద్రబాబుకు అండగా ఉంటూ, పార్టీని పైకి తీసుకురావడానికి కొందరు నేతలు కృషి చేస్తున్నారు. అలాగే అధికార వైసీపీపై నిత్యం పోరాటం చేస్తున్నారు.
అలా పార్టీకి అండగా ఉన్న నాయకుల్లో జవహర్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న జవహర్..తనదైన శైలిలో పనిచేస్తూ ముందుకెళుతున్నారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లని సమన్వయం చేసుకుంటూ, అధికార వైసీపీని ఢీకొట్టే విధంగా టీడీపీని నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు. ఇలా పార్టీ కోసం కష్టపడుతున్న జవహర్‌కు మళ్ళీ కొవ్వూరు బరిలో నిలబడే అవకాశం దక్కింది.
కొవ్వూరు మామూలుగానే టీడీపీకి కంచుకోట. ఇక్కడ ఎక్కువసార్లు టీడీపీ జెండానే ఎగిరింది. 2014లో ఇక్కడ నుంచి జవహర్ విజయం సాధించారు. అలాగే చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే 2019లో రాజకీయ సమీకరణాలు మారాయి. జవహర్‌ని తిరువూరులో నిలబెట్టి, కొవ్వూరులో వంగలపూడి అనితని నిలబెట్టారు. కానీ ఈ సమీకరణాలు వర్కౌట్ అవ్వక పార్టీ ఓడిపోయింది.
దీంతో చంద్రబాబు మళ్ళీ అనితని పాయకరావుపేటకు పంపించేశారు. అయితే జవహర్‌ని రాజమండ్రి పార్లమెంటరీ అధ్యక్షుడుగా పెట్టారు. దాంతో తిరువూరు, కొవ్వూరు సీట్లకు ఇన్‌చార్జ్‌లు లేకుండా పోయారు. తాజాగా తిరువూరుకు శావల దేవదత్‌ని ఇన్‌చార్జ్‌గా పెట్టారు. అలాగే అక్కడ ఉన్న సీనియర్ నేత స్వామిదాసుకు నెక్స్ట్ ఏమన్నా నామినేటెడ్ పదవి ఇవ్వొచ్చు.
ఇలా తిరువూరు సీటు ఇన్‌చార్జ్ ఫిక్స్ అవ్వడంతో కొవ్వూరులో జవహర్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయిపోయింది. ఇక చంద్రబాబు అధికారికంగా ప్రకటించడమే తరువాయి. ఇప్పటికే రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడుగా జవహర్, కొవ్వూరు అసెంబ్లీలో పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడుతున్నారు. మళ్ళీ తిరిగి కంచుకోటలో పసుపు జెండా ఎగరవేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో జవహర్ మళ్ళీ కొవ్వూరు బరిలో నిలబడి సత్తా చాటడం ఖాయమని తెలుస్తోంది.
Discussion about this post