తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నికల పోరు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు గానీ, ఇక్కడ ఎవరు గెలుస్తారో అన్నది మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ జరుగుతోన్న పోరు కేసీఆర్ వర్సెస్ ఈటల మధ్యే అని చెప్పాలి. ఇది వీరిద్దరికి అత్యంత ప్రతిష్టాత్మకం. ఈటల గెలిస్తే ఆయన తన కంచుకోటను నిలుపుకున్నట్టు అవుతుంది. అదే టీఆర్ఎస్ గెలిస్తే ఈటల ప్రభావం ఏ మాత్రం లేదని.. ఆయన కు ఉన్న క్రేజ్ అంతా కేవలం టీఆర్ ఎస్ వల్లే అన్నది తేలిపోతుంది. కేసీఆర్ మాత్రం ఈటలను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే అక్కడ ఆ పార్టీ అగ్ర నేతలు అంతా మకాం వేసి కోట్లాది రూపాయలు వెదజల్లుతున్నారు.
ఇక హుజూరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న గ్రౌండ్ రిపోర్టులతో పాటు జరుగుతోన్న సర్వేలను బట్టి చూస్తే అక్కడ ఈటల గెలుపు ఖాయం అని తెలుస్తోంది. టీఆర్ఎస్ పడుతోన్న పాట్లు అన్ని కూడా ఈటలకు భారీ మెజార్టీ రాకుండా చూసేందుకు మాత్రమే అంటున్నారు. కారు పార్టీ డబ్బులు వెదజల్లకుండా, నాయకులను కొనకుండా ఉంటే అక్కడ ఈటల 50 వేల పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధిస్తాడని అంచనా వేస్తున్నారు. సాధ్యమైనంత వరకు కేసీఆర్, టీఆర్ ఎస్ నాయకులు ఎన్ని ఎత్తులు వేసినా కూడా ఈటల 20 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడని అంటున్నారు.అయితే ఇప్పుడు ఇక్కడ టీఆర్ ఎస్‌కు మరో షాక్ తప్పేలా లేదు. రాష్ట్రంలో ఉన్న 7,600 ఫీల్డ్ అసిస్టెంట్లని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమే ధ్యేయంగా పని చేస్తున్నామని వారు సవాళ్లు రువ్వుతున్నారు. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పసుపు రైతులు 400 వరకు నామినేషన్లు వేసి పోటీలో ఉన్నారు. వీరు 95 వేల ఓట్లు చీల్చడంతో కేసీఆర్ కుమార్తే స్వయంగా 70 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా అదే రేంజ్‌లో నామినేషన్ వేస్తే ఆ ఎఫెక్ట్ అధికార పార్టీపై ఖచ్చితంగా పడుతుందనే అంటున్నారు.
ఇక ఈటలకు వ్యక్తిగతంగా హుజూరాబాద్‌లో మంచి పేరు ఉంది. ఆయన బీసీ ల్లో బలమైన నేత కావడంతో అటు బీసీల్లో పట్టు ఉండడంతో పాటు ఆయన భార్య జమున రెడ్డి కావడంతో రెడ్లలోనూ ఆయనకు సానుభూతి ఉంది. ఈ పరిణామాలన్ని చూస్తే అక్కడ టీఆర్ఎస్‌కే ఇబ్బంది వచ్చేలా కనిపిస్తోందని అంటున్నారు. ఏదేమైనా హుజూరాబాద్‌లో టీఆర్ ఎస్ ఓడిపోతుందనే అంటున్నారు.
Discussion about this post