మళ్ళీ మొదలైంది లొల్లి…కొన్ని రోజుల క్రితం…మంత్రి కొడాలి నాని, టీడీపీ నేత బుద్దా వెంకన్నల మధ్య మాటల యుద్ధం కాదు కాదు..బూతుల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే…గుడివాడలో కొడాలి నాని క్యాసినో ఆడించారని టీడీపీ నేతలు విమర్శలు చేయగా, దానికి కొడాలి ఘాటుగా కౌంటర్ ఇస్తూ..చంద్రబాబుని తెగ తిట్టేశారు..అలా కొడాలి బాబుని తిట్టడంతో..టీడీపీ నుంచి బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు.


ఇలా ఇద్దరు నేతలు తెగ తిట్టుకున్నారు..ఈ క్రమంలోనే వారి మధ్య ఓ ఒప్పందం కుదిరింది…తనని తిట్టకపోతే తాను చంద్రబాబుని తిట్టనని కొడాలి చెప్పుకొచ్చారు..అలాగే తాము చంద్రబాబుని తిడితే మాత్రం ఊరుకోమని, బాబుని తిట్టకపోతే తాము ఏం అనమని బుద్దా చెప్పుకొచ్చారు. ఇలా ఇద్దరు నేతలు బూతులకు కాస్త బ్రేకులు వేశారు. కానీ తాజాగా కొడాలి నాని మరొకసారి బాబుపై విరుచుకుపడటం మొదలుపెట్టారు.


తాజాగా జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే…ఈ విషయంపై టీడీపీ, గట్టిగానే వైసీపీనే టార్గెట్ చేసింది..వైసీపీ మద్యం పాలసీ వల్లే కల్తీ సారా పెరిగి, ఇలా చనిపోయారని వారు విమర్శిస్తున్నారు. ఇక టీడీపీ ప్రభుత్వాన్ని ఎటాక్ చేయడంతో వైసీపీ నేతలు కూడా రివర్స్‌లో వచ్చేశారు. ఈ క్రమంలోనే కొడాలి ఎప్పటిలాగానే బాబుపై బూతులు లంకించుకున్నారు. దీంతో బుద్దా కూడా రంగంలోకి దిగేసి కొడాలిపై ఫైర్ అయ్యారు.. కొడాలి నాని ఓ పిచ్చి కుక్క అని, పిచ్చి కుక్కను అందలం ఎక్కించి నాడు చంద్రబాబు తప్పు చేశారని బుద్దా అన్నారు.

ఇక డేరా బాబా తరహాలో కొడాలి కూడా జైలుకు వెళ్ళడం ఖాయమని, 10 రోజుల్లోనే కొడాలి అవినీతి బయటపెడతా అని బుద్దా చెప్పుకొచ్చారు. మరి అవినీతి గురించి ఏమైనా సమాచారం అలా ఉండి చెప్పారో లేక ఏదో చీకట్లో బాణం వేసి కొడాలిని నెగిటివ్ చేయాలని అనుకున్నారో తెలియదు గాని బుద్దా సరికొత్త రాజకీయానికి తెరలేపారు. చూడాలి మరి 10 రోజుల్లో బుద్దా ఏం తెలుస్తారో.

Discussion about this post