ఏపీ రాజకీయాల్లో ఒక విషయం ప్రత్యేకంగా గమనిస్తే..మంత్రులుగా పనిచేసే నాయకులు…ఆ తర్వాత ఎన్నికల్లో ఎక్కువగా గెలవని సందర్భాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. అదేంటో గానీ మంత్రులుగా పనిచేసేవారు..మళ్ళీ గెలవడం చాలా కష్టం మీద జరుగుతుంది. ఏదో తక్కువ మంది తప్ప…మెజారిటీ మంత్రులు మాత్రం జెండా పీకేస్తారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా పనిచేసిన మంత్రులు 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. కేవలం ముగ్గురు మంత్రులుగా పనిచేసిన నాయకులు మాత్రమే గెలిచారు. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, చినరాజప్పలు మాత్రమే మళ్ళీ గెలిచారు. మిగతా వారంతా అస్సామే.

అయితే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు పరిస్తితి ఏంటి…వారిలో ఎంతమంది మళ్ళీ గెలవగలరు..ఎంతమంది డేంజర్ జోన్‌లో ఉన్నారంటే…ప్రస్తుతానికైతే సగంపైనే మంత్రులు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ మంత్రులు ప్రజా వ్యతిరేకతని కూడా ఎక్కువగా ఎదురుకుంటున్నట్లు కనిపిస్తోంది. కాకపోతే కొందరు మంత్రుల పనితీరు బాగోకపోయినా సరే వారి వారి నియోజకవర్గాల్లో స్ట్రాంగ్‌గానే ఉన్నారు.

అలాంటి వారిని పక్కనబెడితే…పనితీరు బాగోని, ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న మంత్రులు డేంజర్ జోన్‌లో ఉన్నారు. అదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిస్తే అనే రాజకీయ సమీకరణాన్ని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకుంటే సగం మంది మంత్రులు అవుట్ అనే చెప్పొచ్చు.

ఇలా అవుట్ అయ్యే మంత్రులని ఒక్కసారి చూసుకుంటే…పలాసలో సీదిరి అప్పలరాజు, భీమిలిలో అవంతి శ్రీనివాస్, కాకినాడ రూరల్‌లో కన్నబాబు, రామచంద్రాపురంలో చెల్లుబోయిన వేణుగోపాల్, అమలాపురంలో విశ్వరూప్, ఏలూరులో ఆళ్ళ నాని, కొవ్వూరులో వనిత, మచిలీపట్నంలో పేర్ని నాని, విజయవాడ వెస్ట్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రత్తిపాడులో సుచరిత, నెల్లూరు సిటీలో అనిల్, జీడీ నెల్లూరులో నారాయణస్వామి, ఆలూరులో జయరాంలు డేంజర్ జోన్‌లో ఉన్నారని చెప్పొచ్చు. వీరిలో ఎక్కువ ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్న వారు ఉన్నారు..అలాగే టీడీపీ-జనసేన కలిస్తే జెండా పీకేసే మంత్రులు ఉన్నారు. మొత్తానికి సగంపైనే మంత్రులు డేంజర్ జోన్‌లో ఉన్నారు.

Discussion about this post