ఉమ్మడి కర్నూలు జిల్లా అంటేనే టిడిపికి ఏ మాత్రం పట్టు లేని జిల్లా అని చెప్పవచ్చు. ఎప్పుడో 1999 ఎన్నికల్లో జిల్లాలో కొంతమేర సత్తా చాటింది. ఆ తర్వాత నుంచి జిల్లాలో టిడిపి సత్తా చాటలేకపోతుంది. ఇక గత రెండు ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ హవా నడుస్తోంది. 2014 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 సీట్లలో వైసీపీ 11 సీట్లు గెలుచుకుంది. టిడిపికి 3 సీట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో టిడిపి ఒక్క సీటు గెలుచుకోలేదు. వైసీపీ అన్నీ సీట్లు గెలుచుకుంది.

ఇలా వైసీపీ హవా ఉన్న కర్నూలులో ఈ సారి రాజకీయం మారుతుంది. వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..అలాగే టిడిపి బలపడుతుంది. తాజాగా వచ్చిన సర్వేలో కూడా అదే ఫలితం కనిపించింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే టిడిపి 7, వైసీపీ 7 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందట. బనగానపల్లె, శ్రీశైలం, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు స్థానాల్లో టిడిపికి గెలిచే ఛాన్స్ ఉందని..కర్నూలు సిటీ, ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, డోన్ సీట్లలో వైసీపీ గెలుస్తుందని తెలుస్తోంది.

అయితే టిడిపి కాస్త కష్టపడితే కర్నూలు సిటీ, ఆళ్లగడ్డ –నంద్యాలల్లో ఒక సీటు గెలుచుకునే ఛాన్స్ ఉంది. అంటే కర్నూలులో టిడిపికి ఈ సారి లీడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ విషయం పక్కన పెడితే..అసలు కోడుమూరు స్థానంలో టిడిపి గెలిచి చాలా ఏళ్ళు అయింది. ఎప్పుడో పార్టీ పెట్టినప్పుడు 1985లో మాత్రమే అక్కడ టిడిపి గెలిచింది.మళ్ళీ ఇంతవరకు కోడుమూరులో టిడిపి గెలవలేదు. అంటే అక్కడ టిడిపి పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే తొలిసారి అక్కడ టిడిపికి పట్టు దొరికింది. ఈ సారి కోడుమూరులో టిడిపికి గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
