వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు అనివార్యం. రాష్ట్రానికి రాజధాని కావాల్సిన అవసరం ఉంది. అదేసమ యంలో పోలవరం ప్రాజెక్టును అన్ని విధాలా అబివృద్ధి చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఇక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సహా.. దేశీయంగా పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. ఇక, నిరుద్యోగులకు ఉపాధి.. ధరల తగ్గుదల.. కార్పొరేషన్ల బలోపేతం.. ఆయా సామాజిక వర్గాలకు అమలు చేస్తున్న పథకాలు.. ఇలా.. అనేక రూపాల్లో టీడీపీ అవసరం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తే.. పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతుందనే వాదన పార్టీ సీనియర్ నేతల మధ్య తరచుగా వినిపిస్తోంది. ఇప్పుడు.. ఇదే విషయంపై పార్టీలో ఒకక్లారిటీ వచ్చిందనే చర్చజరుగుతోంది. తాజాగా జగన్ అనుసరించిన మంత్రాన్నే తాము కూడా అనుసరించాలని .. సీనియర్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువగా బీసీలకు టికెట్లు ఇవ్వడంతోపాటు.. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలని సీనియర్లు ఇప్పటికే చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. అదేవిధంగా.. ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలను పార్టీ కి మరింత చేరువ చేయాలని.. చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా..యువతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా.. వైసీపీని బలంగా ఢీకొనే శక్తిగా ఇప్పటి నుంచి ఎదిగేందుకు అవకాశం ఉంటుందని.. సీనియర్లు చెబుతున్నారు. “జగన్ ఏం చేశాడు. ఎవరికీ ఏమీ ఇవ్వడం లేదు కానీ, ఏదో చేసినట్టు చెబుతున్నారు. బీసీలకు పదవులు ఇచ్చాడు. నిధులు ఇవ్వలేదు. కానీ, మేం మా హయాంలోనిధులు ధార పోశాం. కానీ, పదవుల విషయంలో మాత్రం కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవమే. అందుకే.. ఇప్పుడు మేం వ్యూహం మార్చుకుని.. పదవులు ఇచ్చే దిశగా ఆలోచన చేయాలని.. మా నాయకుడిని కోరుతున్నాం“ అని ఉమ్మడి తూర్పు గోదావరికి చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
ఇలాంటి వ్యూహాలను తక్షణమే అమల్లో పెట్టాలని.. అనంతపురానికి చెందిన మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కూడా వ్యాఖ్యానించారు. “జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మాత్రం.. ఖచ్చితంగా ఒక వ్యూహం ప్రకారం మేం ముందుకు వెళ్తాం. అన్ని సామాజిక వర్గాలకు సమప్రాధాన్యం ఇచ్చేలా వ్యవహరిస్తాం. నో డౌట్“ అని ఆయన చెప్పుకొచ్చారు. సో.. దీనిని బట్టి.. వ్యూహంతో ముందుకు వెళ్తే.. గెలుపు ఖాయమని అంటున్నారు సీనియర్లు.
Discussion about this post