అనంతపురం జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ అధికార వైసీపీలో ఇద్దరు కీలక నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ , హిందూపురం పార్లమెంటరీ ఇన్చార్జ్ రాష్ట్ర చైర్మన్ నవీన్ నిశ్చల్ ఇద్దరు కూడా పార్టీపై పట్టు కోసం ఆధిపత్య రాజకీయాలకు తెర తీస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో వైసీపీ రెండు గ్రూపులుగా చీలిపోయింది.

2014 ఎన్నికల్లో నవీన్ నిశ్చల్ ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి బాలయ్య చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీ కోసం ఐదు సంవత్సరాలుగా కష్ట పడుతూ వచ్చారు. అయితే గత ఎన్నికల్లో జగన్ నవీన్ ను కాదని విశ్రాంత పోలీస్ అధికారి మహ్మద్ ఇక్బాల్‌కు ఎమ్మెల్యే సీటు వచ్చారు. అయితే బాలయ్యకు 2014 కంటే 2019 ఎన్నికల్లో మెజార్టీ పెరిగింది. ఎన్నికల్లో ఓడిపోయినా జగన్ మైనార్టీ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు.

ఇప్పుడు నియోజకవర్గ ఇన్చార్జిగా తాను ఉన్నాను కాబట్టి… నియోజకవర్గంలో మండల స్థాయి. పార్టీ పదవులు అన్ని తాను చెప్పిన వారికి ఇవ్వాలని ఇక్బాల్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన లెటర్ ప్యాడ్ పై తన వర్గం నేతల పేర్లు రాసి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. మరోవైపు తాను హిందూపురం పార్లమెంటు ఇన్చార్జిగా ఉన్నానని… తాను చెప్పిన వారికే పదవులు వస్తాయని నవీన్ కూడా తన లెటర్ ప్యాడ్ పై సంతకాలు పెట్టి తన అనుచరులకు పదవులు ఇస్తున్నారు.

దీంతో ఒకే పదవి ఇద్దరు నేతలకు ఇస్తుండడంతో అసలు ఆ పదవిలో ఎవరు ఉన్నారో కేడర్‌కే తెలియడం లేదు. ఇద్దరు నేతల గ్రూపు తగాదా లతో 2024 ఎన్నికల్లోనూ హిందూపురంలో బాలయ్య వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బాలయ్యకు 30 వేల పైచిలుకు మెజారిటీ వస్తుందని…. తమ పార్టీ వాళ్లే బాలయ్య కు ఓటేసి గెలిపించాలని స్థానికంగా చర్చించుకోవడం విశేషం.

Discussion about this post