టీడీపీ అధినేత చంద్రబాబు సాధించే రికార్డుల విషయంపై టీడీపీలో సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. బుధవారం చంద్రబాబు 73వ పుట్టిన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా.. సంబరాలు చేసుకునేందుకు తెలుగు దేశం పార్టీ నాయకులు శ్రేణులు కూడా రెడీ అయ్యారు. నిజానికి టీడీపీలో ఈ రేంజ్‌లో ఈ వయసులో పార్టీ అధ్యక్షుడికి సంబరాలు చేయడం.. ఇదే తొలిసారి. పైగా విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబుకు మంచి పేరుంది. ఆయనే సాధించిన విజయాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి 9, నవ్యాంధ్రకు 5 సంవత్సరాలు.. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు.

అదేసమయంలో సైబరాబాద్ నిర్మాణం సహా ఐటీ విప్లవానికి పునాదులు వేశారు. ఇక, నవ్యాంధ్రలో రాజధాని అమరావతి నిర్మాణం.. చంద్రబాబు కీర్తిని దేశవ్యాప్తమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తం చేసింది. ఆయన తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం ప్రపంచ పటంలో ఎక్కింది. ఇక, గత ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్టీ నేతలు అందరూ కుంగిపోయి నా.. ఆయన పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో వస్తున్న పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించు కునేందుకు.. యావత్ పార్టీ కూడా సిద్ధమైంది. దేశవిదేశాల్లోని తెలుగు దేశం పార్టీ అభిమానులు సైతం.. చంద్రబాబుపుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకుంటున్నారు.

ఈ క్రమంలో ఒక చిత్రమైన విషయం చర్చకు వచ్చింది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కాలని.. ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా కష్టించి.. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నా రు. ఆదిశగా ప్రయాత్నాలు కూడా జరుగుతున్నాయి. అదే జరిగి.. అంటే.. టీడీపీ విజయం దక్కించుకుని.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే.. అది అతి పెద్ద సంచలన రికార్డు అవుతుందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం చంద్రబాబు వయసు 72 పూర్తి అయి.. 73 వస్తాయి. ఈ క్రమంలో మరో రెండేళ్లకు ఎన్నికలు వున్నాయి.

దీనిని బట్టి ఎన్నికలు వచ్చే సమయానికి చంద్రబాబు వయసు 75కు చేరుతుంది. సో.. అప్పుడు ఆయన గెలిచి.. సీఎం అయితే.. రాష్ట్ర చరిత్రలో 75 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరాం చేసిన ఏకైక నాయకుడిగా చంద్రబాబు నిలుస్తారు. ఇప్పటి వరకు ఒకే ఒక్కరు 72 ఏళ్లవయసులో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనే కోట్ల విజయభాస్కరరెడ్డి. సో.. చంద్రబాబు కనుక రేపు ముఖ్యమంత్రి అయితే.. ఈ రికార్డు ను తిరగరాయడంతోపాటు.. సరికొత్త చరిత్రను సృష్టించడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Discussion about this post