ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం..సరిగ్గా 2024 ఎన్నికలకు ఇక్కడ టిడిపి గెలిచి 30 ఏళ్ళు అవుతుంది. అంటే ఎప్పుడో 1994 ఎన్నికల్లో అక్కడ చివరిగా టిడిపి గెలిచింది..మళ్ళీ ఇంతవరకు గెలవలేదు..కానీ ఈ సారి మాత్రం ఖచ్చితంగా బొబ్బిలిలో టిడిపి జెండా ఎగిరేలా ఉంది. వైసీపీపై తీవ్ర వ్యతిరేకత రావడం టిడిపి బలపడటం పెద్ద ప్లస్ అయింది.

అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి బొబ్బిలిలో పరిస్తితి చూస్తే..1983లో ఇండిపెండెంట్ గెలవగా, 1985లో టిడిపి గెలిచింది. ఇక 1989లో కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ 1994లో టిడిపి గెలిచింది. ఇంకా అంతే మళ్ళీ అక్కడ టిడిపి ఎప్పుడు గెలవలేదు. 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2014లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి సుజయ కృష్ణ రంగారావు గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన టిడిపిలోకి జంప్ చేశారు. అలాగే ఆయన మంత్రి కూడా అయ్యారు. ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి టిడిపి నుంచి సుజయ బరిలో దిగగా, వైసీపీ నుంచి శంబంగి చిన వెంకట అప్పలనాయుడు పోటీ చేశారు.

ఈయనే 1985, 1994 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. ఇక గెలిచాక త్వరగానే ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం, అవినీతి ఎక్కువనే ఆరోపణలు పెరిగాయి. సొంత పార్టీ నేతలే..ఎమ్మెల్యేని వ్యతిరేకించే పరిస్తితి. దీంతో వైసీపీకి పూర్తి మైనస్ అయింది.
ఇటు టిడిపి నుంచి సుజయ తమ్ముడు బేబీ నాయన ఇంచార్జ్ గా ఉన్నారు..ఆయన ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. టిడిపిని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. దీంతో బొబ్బిలిలో టిడిపి తొలిసారి లీడ్ లోకి వచ్చింది. తాజా సర్వేల్లో కూడా బొబ్బిలిలో ఈ సారి టిడిపి గెలవడం ఖాయమని తేలింది. మొత్తానిక్ 30 ఏళ్ల తర్వాత బొబ్బిలిలో టిడిపి జెండా ఎగరనుంది
