రాజకీయాల్లో నాయకులకు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గానీ…ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఎప్పుడైతే నాయకులు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంటారో…అప్పుడు భారీగా దెబ్బతినడం ఖాయం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే దెబ్బతిన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నేతలు సైతం అదే ఓవర్ కాన్ఫిడెన్స్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ నేతల రాజకీయం చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది.

అసలు మాకు తిరుగులేదు అన్నట్లుగానే వైసీపీ నేతల రాజకీయం ఉంది. పైగా స్థానిక ఎన్నికల్లో కూడా తిరుగులేని విజయాలు సొంతం చేసుకోవడంతో…ఇంకా మమ్మల్ని ఆపేది ఎవరు అన్నట్లుగా ముందుకెళుతున్నారు. పైగా తామే 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామనే ధీమాలోకి వెళ్ళిపోయారు. సరే నాయకులు వెళితే వెళ్లారు…సలహాదారుడుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి సైతం…అదే ధీమాతో ఉండటం కాస్త ఆశ్చర్యంగా ఉంది.

ఎందుకంటే సలహాదారుడుకు రాష్ట్రంలో ఉన్న పరిస్తితులు అర్ధమవుతాయి…కానీ ఆయన కూడా అవేమీ పట్టించుకోకుండా..ఇంకా జగన్ రెండు, మూడు దశాబ్దాల పాటు సీఎంగా ఉంటారని, అది తాము చెప్పడం లేదని…జనమే చెబుతున్నారని అన్నారు. అంటే జనమే…జగన్‌ని 30 ఏళ్ల పాటు సీఎంగా చూడాలని అనుకుంటున్నారా? అంటే ఆ విషయం జనాలని అడిగితేనే బెటర్ అని చెప్పొచ్చు. అసలు వాస్తవానికి చూసుకుంటే గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్న పాజిటివ్…ఇప్పుడు కనిపించడం లేదు. అలాంటిది జనం అనుకుంటున్నారని సజ్జల ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడేస్తున్నారు.

అసలు గ్రౌండ్ రియాలిటీ చూస్తే…సజ్జల మాటలకు పరిస్తితులు కాస్త వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇప్పుడు వైసీపీకి మెజారిటీ ఉన్న మాట వాస్తవమే…కానీ గత ఎన్నికల్లో ఉన్నంత మెజారిటీ మాత్రం ఇప్పుడు లేదు. నిదానంగా వైసీపీ లీడ్ తగ్గుతుంది. అదే సమయంలో టీడీపీ కాస్త పుంజుకుంది. ఇలాగే మరో రెండున్నర ఏళ్ళు కొనసాగితే…వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చే పరిస్తితి ఉంది. ఇవేమీ పట్టించుకోకుండా…జగనే మరో 30 ఏళ్ళు సీఎంగా ఉంటారని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంటే…దెబ్బతినేది వైసీపీనే.

Discussion about this post