ఏపీ సీఎం జగన్ చేసిన తాజా వ్యాఖ్యలపై మేధావులు మండిపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలు.. మాటల మంటలపై.. సీఎం స్థాయిలో పరిష్కారానికి ప్రయత్నించాల్సిన జగన్.. అలా కాకుండా.. `తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారు.. కాబట్టి మౌనంగా ఉంటున్నాం“ అని వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతున్నారు. నిజానికి హైదరాబాద్‌లో కానీ, ఇతరత్రా ప్రాంతాల్లో కానీ, ఏపీకి చెందిన వారు ఐదు లక్షల మందికిమించరు. అందునా..రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాన్ని ప్రజలకు ముడిపెట్టి చూడడం అనేది కూడా అరుదే!
అయినా కూడా జగన్.. ఇలా వ్యాఖ్యానించడం.. చేతకానితనమే అవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే నిజమైతే.. నన్ముందు.. ఏ విషయంలోనూ.. కూడా తెలంగాణ దూకుడుకు.. ఏపీ అడ్డుకట్ట వేసుకునే పరిస్తితి ఉండదని.. అంటున్నారు. “రేపు ఖమ్మం జిల్లాను ఆనుకున్న సరిహద్దులను కూడా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు కూడా ఇలానే చెబుతారా?“ అంటూ.. కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై కర్నూలు జిల్లాలోనూ ఒకరిద్దరు ఇలానే స్పందించారు.విషయాన్ని విషయంగానే చూడాలని.. కేవలం ఐదు లక్షల మంది కోసం.. ఐదు కోట్ల ప్రజల ఆత్మాభిమానాన్ని తక్కువ అంచనా వేస్తే.. మున్ముందు.. చేతగాని ముఖ్యమంత్రి అనే పేరు స్థిరపడిపోవడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే కేంద్రం దగ్గర నోరు విప్పలేని పరిస్థితి వచ్చిందని.. ఇప్పుడు.. తెలంగాణ వద్ద కూడా నోరు విప్పకుండా.. తెలుగు ప్రజలు ఉన్నారనే సాకును చూపడం ఏమంత సమంజసం కాదని.. అంటున్నారు.
నిజానికి తెలంగాణ కనుక జగన్ అనుకున్న విధంగానే చేస్తే. అది అక్కడి ప్రజలు తేల్చుకుంటారని.. ఓటు హక్కుతోపాటు.. పన్నులు కూడా తెలంగాణలో కడుతున్న ప్రజల కంటే.. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను తక్కువగా చూడడం సమంజసం కాదని అంటున్నారు. ప్రజలు ప్రజలే.. రాజకీయాలు రాజకీయాలే.. అన్న విధంగా జగన్ రంగంలోకి దిగితేనే.. మంచిదని చెబుతున్నారు. ప్రస్తుతం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే కౌంటర్లు ఇవ్వనున్నట్టు సమాచారం.
Discussion about this post