సీనియర్ నాయకుడు.. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్న నేత.. అన్నా రాంబాబు. ఈయనకు వచ్చిన మెజారిటీ ఏమీ సాధారణం కాదు. 2019 ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సొంతం చేసుకున్న ఆయన.. వైసీపీ అధినేత జగన్ తన సొంత నియోజకవర్గంలో సాధించిన మెజారిటీకి దాదాపు సరిసమానంగా 82 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో రాంబాబు విజయం దక్కించుకున్నారు. మరిఇంత మెజారిటీ ఉందంటే.. నియోజకవర్గంలోని ప్రజలు ఆయన వెంట ఉన్నట్టే కదా! కట్ చేస్తే.. రెండున్నరేళ్లు గడిచిపోయింది. మరి ఇప్పుడు ఎంత మంది ప్రజలు ఆయన వెంట ఉంటున్నారు? అనేది ఆరాతీస్తే.. చాలా చాలా తక్కువనే చెబుతున్నారు పరిశీలకులు.

తాజాగా టీడీపీ నాయకుడు పట్టాభి చేసిన వ్యాఖ్యలనే పథ్యంలో చంద్రబాబు నిరసన దీక్ష చేశారు. దీనికి ప్రతిగా.. వైసీపీ నేతలు జనాగ్రహదీక్షలకు దిగారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ దీక్షలు నిర్వహించాలని వైసీపీ అధిష్టానం పిలుపుని చ్చినా.. నాయకులు బరిలోకి దిగి దీక్షలను దిగ్విజయం చేయాలని హుకుం జారీ చేసినా, గిద్దలూరులో మాత్రం ఈ జనా గ్రహ దీక్షలకు జనాగ్రహం ఎదురైందని అంటున్నారు పరిశీలకులు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అంటే.. ఇక్కడ నిజమైన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రాధాన్యం లేదు. కేవలం పదవుల కోసం.. ఎన్నికలకు ముందు.. వచ్చి చేరిన వారికే ప్రాధాన్యం ఉంటోం ది.

వారికే .. పదువులు వస్తున్నాయి. కాంట్రాక్టులు దక్కుతున్నాయి. అంతేతప్ప ఆది నుంచి పార్టీలో ఉన్నవారికి కనీసం సర్పంచ్ పదవులు కూడా దక్కడం లేదు. నిజమైన వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు మొండి చేయే మిగులుతోంది. దీంతో నిజమైన వైసీపీ నాయకులకు కార్యకర్తలు కుమిలిపోతున్నారు. ఈ ఎఫెక్ట్ ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా. స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఏ కార్యక్రమం చేసినా.. పట్టుమని పది మంది కూడా హాజరు కాని పరిస్థితి ఉంది. వాస్తవానికి జనాగ్రహ దీక్షను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే భారీ ఎత్తున టెంట్లు వేశారు. కానీ, ఏం లాభం ఎవరూ రాలేదు. ఎలాంటి సందడీ లేదు.

వచ్చిన అతి కొద్ది మంది కూడా ఎవరికివారు తమ చేతుల్లో సెల్ ఫోన్లు చూసుకుంటూ.. కాలక్షేపం చేశారు. దీంతో గత ఎఎన్నికల్లో వచ్చిన భారీ మెజారిటీ ఇప్పుడు లేదని.. ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోతోందని గుసగుసలు సొంత పార్టీలోనే అన్నా రాంబాబుకు ఎదురవడం గమనార్హం. మరి ఆయన దీనిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారో.. లేక.. తన దారిలో తాను పయనిస్తారో చూడాలని అంటున్నారు పరిశీలకులు. నిజానికి ఫైర్ బ్రాండ్ నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. కానీ, ఇప్పుడు ఫైర్ పోయి.. కేవలం నాయకుడిగానే మిగిలిపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇదే కొనసాగితే.. ఈ మెజారిటీ మాటామో కానీ.. అసలు గెలుపునకే కష్టమని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post