రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో నేతల మధ్య వివాదాలు, విభేదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. ముఖ్యం గా ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఈ వివాదాలు మరింతగా సాగుతున్నాయి. ఈ క్రమంలో గుంటూరుకు మరింత ప్రత్యేకత ఉంది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు, ఇదే జిల్లాలోని చిలకలూ రిపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే విడదల రజనీకి మధ్య తీవ్ర వివాదాలు ఉన్న విషయం తెలిసిం దే. ఇరు వురికి మధ్యపచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అయితే.. ఏడాది మొత్తంలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. శివరాత్రి విషయానికి వచ్చే సరికి మాత్రం ఇరువురు నేతల మధ్య మరింతగా ఈ వివాదం పెరుగుతోంది.


దీనికి కారణం.. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న కోటప్పకొండ దేవస్థానమే! ఈ ఆలయంపై పెత్తనంకోసం.. అటు ఎంపీ, ఇటు ఎమ్మెల్యే కూడా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఏకంగా.. అనుచరులు.. రాళ్ల దాడికి కూడా దిగారు. ఈ విషయం ఏకంగా.. సలహాదారు రామకృష్ణా రెడ్డి దృష్టికి కూడా వెళ్లింది. అయితే..అప్పట్లో ఆయన ఏదో సర్దుబాటు చేశారు. ఇక, అప్పటి నుంచి పెద్దగా ఇరువురు నాయకులు కీచులాడుకోవడం తగ్గించారు. అయితే.. ఇప్పుడు మరోసారి శివరాత్రి సంబరాలకు కోటప్ప కొండ రెడీ అయింది. దీనికి సంబంధించి ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది.

అదేసమయంలో పార్లమెంటరీ నియోజకవర్గం అభివృద్ధి నిధుల నుంచి ఎంపీ కూడా కొంత మొత్తం కేటా యించారు. ఈ నిధుల వినియోగం నుంచి కోటప్పకొండ తిరునాళ్ల వరకు ప్రతి కార్యక్రమం విషయంలోనూ .. ఇరు పక్షాల నాయకులు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శలువ స్తున్నాయి. అంతేకాదు.. ప్రొటోకాల్ నిబంధనల మేరకు అనుసరించే అధికారులపైనా .. ఒత్తిళ్లు పెరగడంతో ఆలయానికి సంబంధించిన కీలక అధికారి సెలవుపై వెళ్లిపోయినట్టు సమాచారం.

దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ తాత్కాలిక అధికారికి బాధ్యతలు అప్పగించింది. అయితే.. ఆయనకు ఇక్కడి రాజకీయాలు తెలియకపోవడంతో.. ఎలా వ్యవహరిస్తారనేది చూడాలి. మరోవైపు.. ఎంపీ, ఎమ్మెల్యేలు ఇద్దరూ కూడా తగ్గేదేలే! అంటుండడంతో ఈ సారి తిరునాళ్లు కూడా వివాదంగా మారి.. బల ప్రదర్శనకు దారితీస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతుండడం గమనార్హం.


Discussion about this post